28.7 C
Hyderabad
April 28, 2024 06: 27 AM
Slider నిజామాబాద్

ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్

#acb

కల్వర్టు నిర్మాణం కోసం రైతు వద్ద 20 వేలు లంచం

గత రెండు రోజులుగా కామారెడ్డిలో ఎసిబి పేరు మారుమ్రోగుతోంది. ఏసిబి అధికారులమంటూ జిల్లా అధికారులకు ఫోన్లు చేసిన అపరిచిత వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మరువక ముందే జిల్లా కేంద్రంలో నిజంగానే ఏసిబి అధికారులు దాడి చేసిన ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. ఏసీబీ అధికారుల దాడిలో అటవీశాఖ బీట్ ఆఫీసర్ పట్టుబడ్డాడు. లంచం తీసుకుంటూ పట్టుబడిన వ్యక్తి రాజంపేట మండలం కొండాపూర్ గ్రామ బీటా ఆధికారిగా వీధులు నిర్వహించే శ్రీనివాస్ గా గుర్తించారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఏసీబీ డిఎస్పి ఆనంద్ వెల్లడించారు. రాజంపేట మండలం కొండాపూర్ అటవీ ప్రాంత శివారులో రైతులు తమ పొలాల వద్దకు వెళ్లేందుకు వాగుపై కల్వర్టు నిర్మించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న కొండాపూర్ బీట్ ఆదికారి శ్రీనివాస్ కల్వర్టు నిర్మాణ పనులను చేపట్టవద్దని, పనులకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తానని రైతులకు తెలిపారు. ఎలాగైనా కల్వర్టు నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వాలని అధికారిని రైతులు కోరగా ఇదే అదునుగా భావించిన శ్రీనివాస్ అనుమతి కోసం 30వేల రూపాయలు ఇవ్వాలని రైతులను డిమాండ్ చేశాడు.

దీంతో 20వేల రూపాయలు ఇచ్చేందుకు రైతులు ఒప్పుకున్నారు. ఈ విషయమై సిద్ధిరాములు అనే రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారు చెప్పిన విధంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద నేడు 20 వేల రూపాయలను బీట్ ఆఫీసర్ శ్రీనివాస్ కు అందజేశాడు. దాంతో ఏసీబీ అధికారులు లంచం తీసుకున్న బీట్ అధికారి శ్రీనివాస్ ని పట్టుకున్నారు. గతంలో సిద్ధిరాములు అటవీ ప్రాంతంలో వంట చెరుకును తీసుకుపోతుంటే కొంతమంది అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. అయితే తన కూతురు పెళ్లికి తీసుకెళ్తున్నానని అవి అడవిలో కొట్టిన కట్టెలు కావనో, అక్కడక్కడ విరిగిన కర్రలను తీసుకువెళ్తున్నానని చెప్పడంతో అడవి శాఖ అధికారులు వదిలేసి వెళ్లిపోయారని, అనంతరం నాలుగు రోజుల తర్వాత బీట్ అధికారి శ్రీనివాస్ సిద్ధిరాములు ఇంటికి వెళ్లి నేను చెబితేనే మిమ్మల్ని అటవీ శాఖ అధికారులు వదిలిపెట్టారని ఇందుకు 40 వేల విలువగల టేకు ప్రేమ్ ఇవ్వాలని డిమాండ్ చేశాడని ఏసిబి అధికారులకు రైతు సిద్దిరాములు తెలిపాడు. ఈ విషయాన్ని సైతం అధికారులు పరిగణలోకి తీసుకొని విచారణ చేపట్టారు. బీట్ ఆఫీసర్ శ్రీనివాస్ ను అధికారులు అరెస్ట్ చేశారు.

Related posts

అంబేద్క‌ర్ బాట‌లోనే యువ‌త ప‌య‌నించాలి

Sub Editor

లైవ్ టెలీకాస్ట్ ఓన్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై కరోనా ప్రభావం

Satyam NEWS

పాత కొప్పెర్లె అంగ‌న్‌వాడీ కేంద్రం త‌నిఖీ చేసిన విజయనగరం కలెక్టర్

Satyam NEWS

Leave a Comment