ఎప్పుడైనా నేను ఒక పదం తప్పు పలికితే నన్ను ఎంత ఎగతాళి చేస్తున్నారో మీకందరికి తెలుసు. ఇలా ఎందుకు జరుగుతున్నదంటే నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం వల్ల. అందుకే ఆ బాధ తెలిసినవాడిగా నేను తెలుగు మీడియం ఉండాలనే కోరుకుంటున్నాను అన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పేద ప్రజలకు ఇంగ్లీష్ మీడియం వద్దు అని మేం అనడం లేదు. మాతృ భాష లేకుండా చేయాలన్న నిర్ణయాన్ని మాత్రమే మార్చుకోవాలని అడిగాం. తెలుగుదేశం పార్టీ డిమాండ్ ఒక్కటే. అప్షన్ విద్యార్థులకు,తల్లిదండ్రులకు ఇవ్వండి ఏ మీడియం కావాలో వారే నిర్ణయించుకుంటారు. బలవంతంగా మీ ఆలోచనల్ని విద్యార్థులపై ప్రయోగించకండి. మాతృ భాష లేకుండా చేస్తాం అనడం కరెక్ట్ కాదు. తెలుగు రాకపోతే ఎంత ఇబ్బంది పడతామో నాకు బాగా తెలుసు అని లోకేష్ అన్నారు. విదేశాల్లో ఎక్కువ కాలం చదవడం వలన తెలుగు నేర్చుకోలేకపోయాను. అందుకే మాతృభాష కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను అని లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే మున్సిపల్స్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం. అప్పుడు విద్యార్థులకు అప్షన్ ఇచ్చాం అని లోకేష్ తెలిపారు.
previous post