38.2 C
Hyderabad
May 3, 2024 19: 50 PM
Slider శ్రీకాకుళం

కరోనాతో మరణించిన సమగ్ర శిక్ష ఉద్యోగస్థులను ఆదుకోండి

#gundabalamohan

కరోనాతో చనిపోయిన ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగస్తుల కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష ఒప్పంద పొరుగు సేవల గౌరవ అధ్యక్షులు డాక్టర్ గుండబాల మోహన్ డిమాండ్ చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో గడిచిన ఏప్రిల్, మే నుంచి అనేకమంది సమగ్ర శిక్ష ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగస్తులు కరోనా బారిన పడి మరణించారని ఆయన అన్నారు.

చనిపోయిన ఈ సమగ్ర శిక్ష ఒప్పంద పొరుగు సేవ ఉద్యోగస్తులకు వారి కుటుంబాలకు ఇటు ప్రభుత్వం గానీ ఇటు విద్యాశాఖ అధికారులు గానీ ఆర్థిక సహాయం  అందటం లేదని ఈ సందర్భంగా తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  శాశ్వత ఉద్యోగస్తులు చనిపోతే వారికి ఏ విధంగా ప్రభుత్వ ఆర్థిక సహాయం అందిస్తుందో అదేవిధంగా సమగ్ర శిక్ష ఒప్పంద పొరుగు సేవలు  ఉద్యోగస్తులు కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

కరోనాతో చనిపోయిన ఉద్యోగస్తులు కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

Related posts

ప్రొటెస్టు: కూలీలకు దక్కని కరోనా సాయం

Satyam NEWS

ప్రపంచ కార్మిక దినోత్సవం విజయవంతం చేయాలి

Satyam NEWS

స్కాలర్ షిప్ అక్రమాలపై ఎఫ్ ఐ ఆర్ నమోదు

Satyam NEWS

Leave a Comment