30.7 C
Hyderabad
April 29, 2024 06: 25 AM
Slider నల్గొండ

వెనుకబడిన వడ్డెర కులస్తులను తక్షణమే ఆదుకోవాలి

#hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎన్ ఎస్ పి క్యాంపు ఆవరణలో వడ్డెర సంఘం సమావేశం ఆదివారం ఉదయం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వడ్డెర సంఘం ముఖ్య సలహాదారు,తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు ఎడ్ల విజయ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ వడ్డెర కులం చాలా వెనుకబడిన కులమని,కాయకష్టం చేసుకొని కష్టపడి రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు ఉన్నాయని, కనీసం వడ్డెర కులస్తులు మరణిస్తే పూడ్చటానికి ఆరు అడుగుల స్థలం లేకపోవడం ఎంతో బాధాకరమని,వడ్డెర కులస్తులకు స్మశాన వాటికకు రెండు ఎకరాల స్థలం కేటాయించాల్సిందిగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి  సమస్యలు పరిష్కరించే వరకు కృషి చేయాలని సంఘం  తీర్మానించిందని అన్నారు.

వడ్డెర కుల అభివృద్ధికి,కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర సమయంలో కరోనా బారిన పడిన కుటుంబాలను ఆదుకోవడానికి, వారికి అవసరమైన సేవలకు కుల సంఘం పాటుపడాలని కమిటీలో తీర్మానించిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో వడ్డెర యువజన సేవా సంఘం అధ్యక్షుడు వేముల వెంకటేష్,ఉపాధ్యక్షుడు తమ్మిశెట్టి నరసింహరావు,కోశాధికారి వేముల శివకృష్ణ, కార్యదర్శి చల్లా రమేష్,కార్యవర్గ సభ్యులు వేముల రమేష్ ,పందిపోటు లక్ష్మణ్, తమ్మిశెట్టి రాజా, వేముల ఏసోబు, బండి సతీష్, తమ్మిశెట్టి గోపి చరణ్, వేముల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

“బ్యాక్ డోర్” టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్

Satyam NEWS

వృద్ధాశ్రమానికి యాదవ సంఘం నిత్యావసర వస్తువులు

Satyam NEWS

బిగ్‌బాస్ ఈజ్ వాచింగ్ యు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment