33.2 C
Hyderabad
May 11, 2024 13: 48 PM
Slider నల్గొండ

రంగుమారిన ధాన్యాన్నిషరతులు లేకుండా కొనుగోలు చేయాలి

#TDP Hujurnagar

రైతులకు గిట్టుబాటు ధరతో ఇవ్వడంతో పాటు ధాన్యం కొనుగోళ్లు చేయాలంటూ మంగళవారం టి.డి.పి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఆర్.డి.ఓ వెంకారెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నల్గొండ పార్లమెంట్ తెలుగు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ రామజోగి గౌడ్ పలువురు టి.డి.పి నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ సన్న రకం పంట వేయమని చెప్పడం వల్లనే రైతులు మోసపోయారని అన్నారు.

సన్న రకం పంట వేయడంతో పంట దిగుమతి  రాలేదని, దానితో పాటు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.

మద్దతు ధర 2500 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వానాకాలం సీజన్లో సాగు చేసిన వారికి అకాల వర్షాలు, వరదల వల్ల పంటలకు తెగుళ్లు సోకి దిగుబడి 50 శాతానికి పడిపోయిందని అన్నారు.

ఐకెపి కేంద్రాల ద్వారా పల్లెల్లో కూడా ధాన్యాన్ని కొనాలని, రంగు మారిన ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో T N T U C రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావా సహదేవ రావు, పట్టణ టిడిపి పార్టీ అధ్యక్షుడు తండు సాయిరాం గౌడ్, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి  గార్లపాటి శ్రీనివాస్,

రాష్ట్ర టిడిపి బీసీ సెల్ కార్యదర్శి ఎలక వెంకటేశ్వర్లు గౌడ్, పార్లమెంట్ టిడిపి సహాయ కార్యదర్శి నలమాద శ్రీనివాస్ యాదవ్, చల్లా వంశీ, రాష్ట్ర మైనార్టీ నాయకుడు షేక్ చిన్న సైదా,

పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి ఆవుల పాడి శ్రీనివాస్, T N T U C నల్లగొండ పార్లమెంట్ కార్యదర్శి గొట్టే రాము తదితరులు పాల్గొన్నారు.

చంద్రశేఖర శర్మ, సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

27న టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం

Satyam NEWS

భారీగా అంబర్ గుట్కా స్టాక్ పట్టుకున్న వర్థన్నపేట పోలీసులు

Satyam NEWS

అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ కు డాక్టర్ డి.కె సిన్హా

Satyam NEWS

Leave a Comment