38.2 C
Hyderabad
May 3, 2024 19: 32 PM
Slider గుంటూరు

హైకోర్ట్ తీర్పును గౌరవించి జీ.ఓ.లు 81 ,85 రద్దు చేయాలి

kotapally subbarao

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసి 1వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ఇంగ్లీషు మాథ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు ఇచ్చిన జీ.ఓ.లు 81 85 ఉన్నత న్యాయ స్థానం కొట్టివేయడం శుభ సూచకమని తెలుగు భాషా పరిరక్షణ  పార్టీ అధ్యక్షులు కోటపల్లి సుబ్బా రావు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఈ తీర్పు పట్ల గౌరవాన్ని పెంపొందిచుకొని, ఆ జీవోలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత సంవత్సర కాలంగా తెలుగు భాషాభిమానులు, భాషాసంఘాలు, పార్టీ పక్షాన పలుమార్లు తెలుగు రాష్టాలకు చేసిన విజ్ఞప్తులను పెడచెవిన పెట్టడం విచారకరమన్నారు. ప్రభుత్వం అనవసరమైన భేషజాలకు పోకుండా ఉన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును  వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సుబ్బా రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించాలనే భావనకు పోకుండా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సత్వరమే అమలు పరచి మాతృ భాషాగౌరవాన్ని , ఖ్యాతిని కాపాడాలని కోరారు.

Related posts

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం కొణిజేటి రోశయ్య మృతికి సంతాపం

Satyam NEWS

“ఫ్రెండ్ షిప్” టైటిల్ లోగో ఆవిష్కరించిన మంత్రాలయం పీఠాధిపతి

Satyam NEWS

నమ్మకం పెంచాలి

Murali Krishna

Leave a Comment