28.7 C
Hyderabad
April 28, 2024 06: 32 AM
Slider ఖమ్మం

సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

#ministerpovvada

ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో రూ.2 కోట్లతో నూతనంగా నిర్మించిన రెండు లైన్ల రహదారి, డివైడర్, సెంట్రల్ లైటింగ్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. స్తంభాధ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(SUDA) నిధులు రూ.2 కోట్ల రూపాయల కేటాయించి ఆయా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు తో మంచుకొండ గ్రామం వెలుగుజిలుగులతో వెలిగిపోతోంది.

నగరాభివృద్ధిలో భాగంగా ఇటీవలే మండలంలోని వివి పాలెం గ్రామంలో రూ.2 కోట్లు వెచ్చించి సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్, రోడ్లు ఏర్పాటు చేసి మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సూడా చైర్మన్ విజయ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, తదితరులు ఉన్నారు.

Related posts

హంస వాహనంపై పై కోదండ రామయ్య

Satyam NEWS

పదాధికారులతో సమావేశమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…!

Satyam NEWS

మంత్రి అంబటి పై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

Bhavani

Leave a Comment