యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణ్ పూర్ లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయోధుడు, నల్గొండ మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ విగ్రహాన్ని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్మ బిక్షం ఎప్పుడు గౌడ జాతి కోసం పని చేసేవాడని, నీరా పాలసీ తేవాలని గతంలో పోరాటం చేశాడని అన్నారు. చాలా సాదాసీదాగా ఉండే ధర్మ బిక్షం గొప్ప నాయకుడని ఆయన అన్నారు. ధర్మ బిక్షం ఆశించినరీతిలో నీరా పాలసీ ప్రవేశపెట్టిన ఘనత మన సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి అన్నారు. నీరా లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని, అది మంచిది దీనితో మనకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని మంత్రి వెల్లడించారు. కల్లు గీత కార్మికులను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి వెల్లడించారు. గతంలో గీత కార్మికుడు దురదృష్ట వశాత్తూ చనిపోతే చాలీచాలని ఎక్స్ గ్రేషియా ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తూ జీఓ జారీ చేశారని మంత్రి తెలిపారు. అంతేకాదు శాశ్వత అంగవైకల్యం వస్తే కూడా 5 లక్షల ఎక్స్ గ్రేషియా వచ్చేటట్లు కేసీఆర్ జీఓ ఇచ్చారని ఆయన తెలిపారు. ధర్మ బిక్షం విగ్రహ ఆవిష్కరణ చెయ్యడం నా అదృష్టం గా భావిస్తాను. ఆయన గొప్ప నేత మనకు ఆరాధ్యుడు అని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులవృత్తులకు అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ అనేకమార్లు చెప్పారు చేసి చూపిస్తున్నారు అని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
previous post