27.7 C
Hyderabad
April 30, 2024 08: 11 AM
Slider కృష్ణ

రామనామం రాయటం లో బామ్మ బాటలో చిన్నారి…!

#grandchildren

కొద్ది నెలల క్రితమే అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం..88 ఏళ్ల బామ్మ..రామనామం రాయడం ప్రారంభిస్తే ఆ బామ్మ బాటను చాలా మంది అనుసరించడం ప్రారంభించారు.

ఆ కోవలోనే విజయవాడ భావానీపురం రోడ్డ స్వామి శ్రీ రామానంద ఆశ్రమం లో ఉంటున్న శ్రీ శాంతిమయి శరత్ ల బిడ్డ కాత్యాయనీ… ఆ బామ్మ బాటనే ఎంచుకున్నారు.

తండ్రి శతృఘ్నకుమార్…హెల్త్ డిపార్ట్మెంట్ లో పని చేస్తుండగా ఆయన భార్య శ్రీ శాంతి మయి..ఆశ్రమ బాధ్యతలను చూసుకుంటున్నారు.

వారికున్న ఇద్దరు పిల్లలలో పెద్థమ్మాయి ఏడవతరగతి చదువు తున్న కాత్యాయనీ.. ఈ రామ నామం రాయతలబెట్టింది.

ఎనిమిది పదుల వయస్సులోనే రామనామం రాయడాన్ని తలపెట్టిన బామ్మే…అంతటి పని చేస్తే..12 ఏళ్లున్న నేను రాయలేనా అంటూ…రామనామం రాయటాన్ని తలపెట్టింది.

నాలుగు రోజుల క్రితం రామనామాన్ని తలపెట్టిన కాత్యాయనీ.. ఇప్పటి వరకూ దాదాపు 5 వేలకు పైగా “శ్రీరామ” అంటూ రాసింది.

అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం లో ఉడత సాయం చేసేందుకు నాదో చిన్న యత్నమని చిన్నారి చెప్పడం..ఈ ఆధునిక కాలంలో… స్మార్ట్ ఫోన్ లు పట్టుకుని ఉంటున్న పిల్లలందరికీ స్పూర్తి దాయకమనే చెప్పాలి.

Related posts

అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

Satyam NEWS

సూర్యప్రభ వాహనంపై స‌క‌ల‌ లోక ర‌క్ష‌కుడు

Satyam NEWS

ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ గా కుడుముల సత్యం ముదిరాజ్

Satyam NEWS

Leave a Comment