37.2 C
Hyderabad
May 1, 2024 14: 07 PM
Slider రంగారెడ్డి

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విజయవంతంగా చలివేంద్రం

#VasaviClub1

పెరిగిపోతున్న ఎండల నుంచి ప్రజలకు కాపాడేందుకు తాండూరు వాసవి క్లబ్ జమ్స్, ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ సంయుక్తంగా చలివేంద్రాలు నిర్వహిస్తున్నారు.

వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ నెల 1వ తేదీ నుంచి నిర్వహిస్తున్న చలివేంద్రాలు విజయవంతంగా నడుస్తున్నాయి.

తాండూరు మునిసిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమాల్ ప్రారంభించిన ఈ చలివేంద్రాలలో ప్రతి రోజు మధ్యాహ్నం 12.30 నుండి సాయంత్రం 5.00 వరకు రాగి అంబలి, మజ్జిగ, చల్లని నీరు పంపిణీ చేస్తున్నారు.

ప్రతి రోజు 50 లీటర్ల వరకూ రాగి అంబలి, 50 లీటర్ల వరకూ మజ్జిగ, చల్లని త్రాగు నీరు అందచేస్తున్నారు.

మే 30 వరకు ఈ కార్యక్రమం నడుస్తుందని, వారానికి ఒక్క సారి అన్నవితరణ కార్యక్రమం చేస్తున్నామని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కాబినెట్ జాయింట్ ట్రజరర్, వికారాబాద్ జిల్లా  ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ, లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూరు కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్ తెలిపారు.

ఈ కార్యక్రమం విజయవంతంగా నడిచేందుకు దాతలు ముందుకు రావడం సంతోష కరమని వైష్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కొక్కాల సంతోష్ కుమార్, కోశాధికారి నందారం నరసింహ అన్నారు.

వాసవి క్లబ్ అధ్యక్షులు కెలిగారి ప్రవీణ్ కుమార్, సెక్రటరీ గుముడలా గౌరీశంకర్, కోశాధికారి మోముల హరీష్ తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Related posts

గుడ్ వర్క్: కరోనా వైరస్ పై పిల్లలకు అవగాహనా కార్యక్రమం

Satyam NEWS

సీఐడీ పోలీసులు కొట్టారు: న్యాయమూర్తి ఎదుట దారపనేని నరేంద్ర

Satyam NEWS

గంటసేపు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్ లు బంద్… దేనికంటే…?

Satyam NEWS

Leave a Comment