42.2 C
Hyderabad
May 3, 2024 17: 03 PM
Slider నిజామాబాద్

గోపన్ పల్లి బిడ్డ దక్షిణ కొరియాలో ఉన్నత శిఖరాలకు…

#kamareddydistrict

మారుమూల గ్రామం నుంచి ఐఐటి చదివి విదేశాలకు వెళ్లడం అంటే మాటలా? అలాంటి ఘనత సాధించిన ఒక యువకుడిని ఆ గ్రామం మొత్తం కలిసి సన్మానించింది. కామారెడ్డి జిల్లా గోపన్ పల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన మోకాళ్ళ హన్మండ్లు మొదటి కుమారుడు మోకాళ్ళ వీరేశం చక్కగా చదువుకుని ఇప్పుడు దక్షిణ కొరియా వెళ్లాడు. వీరేశం తన చదువును ప్రారంభించింది గోపన్ పల్లి గ్రామంలోనే. 2009 లో పదో తరగతి పరీక్షలు రాశాడు. ఆ సంవత్సరం మండలంలోనే ప్రధమ స్థానంలో నిలిచాడు వీరేశం. ఆ తర్వాత బాసర ట్రిబుల్ ఐటీలో స్థానం సంపాదించాడు. అక్కడ చదువు విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ లోని ఐఐటిలో చేరాడు. అక్కడ నుంచి పరిశోధన కోసం దక్షిణ కొరియాకు వెళ్లాడు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన వీరేశం గ్రామానికి రావడంతో గ్రామంలో పండుగ వాతావరణ నెలకొన్నది. గ్రామంలో చదివి ఉన్నత శిఖరాలకు చేరడంపై గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. వీరేశం ఉన్నత శిఖరాలకు చేరడం మన రాష్ట్రానికే గర్వకారణమని గ్రామస్థులు తెలిపారు.

జీ. లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం  

Related posts

రైతు చట్టాలకు వ్యతిరేకంగా మే 26న బ్లాక్ డే పాటించాలి

Satyam NEWS

రైతు భరోసా ఎందుకు? ముందు కరోనా నుంచి కాపాడండి

Satyam NEWS

మోడీ మట్టీ నీళ్లు ఇస్తే అమరావతికి కేసీఆర్ ఏమిద్దామనుకున్నారంటే…

Satyam NEWS

Leave a Comment