40.2 C
Hyderabad
April 28, 2024 16: 01 PM
Slider ప్రత్యేకం

కొల్లాపూర్ లో మళ్ళీ మొదలైన లక్కీ డ్రా స్కీంలు..ఎస్పీ హెచ్చరించినా!

#luckeydraw

తెలంగాణ రాష్ట్రంలో లక్కీ డ్రా స్కీములు నిషేధం అని ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు హెచ్చరించినా గాని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో లక్కీ డ్రా స్కీమ్ లను నిర్వహిస్తున్నారు. కొందరు అడ్డదారిలో సంపాదించడానికి అలవాటు పడినవారు ఈ స్కీం లు నిర్వహిస్తున్నారు. కొందరిని మేనేజ్ చేస్తూ   స్కీమ్ లతో అడ్డదారిలో మూటలు కట్టుకుంటున్నారు.

అక్రమార్కుల కొమ్ముకాసే కొందరు అధికారుల సహాయ సహకారాలు కూడా ఈ నిర్వాహకులకు ఉన్నాయని మాటలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద వారి అండదండలతో కొల్లాపూర్ లో లక్కీ డ్రా స్కీమ్ లు ఎదేచ్ఛగా కొనసాగిస్తున్నరని అంటున్నారు. రిజిస్ట్రేషన్ చేయించబడింది అంటూ  మీ సేవ పత్రాలు చూపిస్తూ కొందరు ఈ స్కీమ్ లు నడుపుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ లాంటి  లక్కీ డ్రా స్కిమ్ లను పోలీసులు అడ్డుకుంటున్నారు. డ్రా సమయంలో పోలీసులు దాడులు చేస్తున్నారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకుంటున్నారు. మరి ఆ చట్టాలు కొల్లాపూర్ లో  వర్తించవేమో  తెలియదు. ఏకంగా జిల్లా ఎస్పీ హెచ్చరించినా గాని నడుస్తున్నాయి అంటే ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలని కొందరు అంటున్నారు.

అమాయక ప్రజలకు బహుమతులను ఆశ చూపి  మోసం చేస్తున్నారు. 12 నెలలు నెలకు వెయ్యి రూపాయలు కట్టాలి అంటూ వసూలు చేస్తున్నారు. రకరకాల బహుమతులను ఆశ చూపుతూ డబ్బులు దండుకుంటున్నారు. నిర్వాహకులు అడ్డదారిలో సంపాదనకు  అలవాటుపడ్డారు. ఇందులో గ్రామీణ స్థాయి యువత తో డబ్బులు వసూలు చేయిస్తున్నారు నిర్వాహకులు.

వారికి  కమిషన్లు ఇస్తూ ఈ స్కీం లలో భాగస్వాములను చేస్తున్నారు. యువతను  తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇదివరకు కొల్లాపూర్ లో నిర్వహించిన లక్కీ డ్రా స్కీమ్ ల పై జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు అచారి స్పందించారు. నిర్వాహకులతో పోలీసులు కుమ్మక్కయ్యారా అని కూడా బీసీ కమిషన్ ప్రశ్నించింది. నిర్వాహకులను అరెస్టు చేయాలని కూడా బీసీ కమిషన్ ఆదేశించింది.

అయినా కూడా నిర్వాహకులు తీరు మార్చుకోవడం లేదు.  నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ ఇదివరకు  ఓ దిన పత్రికకు వివరణ కూడా ఇచ్చారు. లక్కీ డ్రా స్కీం లు నిర్వహించడం నిషేధమని హెచ్చరించారు. కానీ కొల్లాపూర్ లో మాత్రం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతున్నాయి. ఇదివరకు  లక్కీ డ్రా లో నడిపిన వారే ఇప్పుడు మళ్లీ నడుపుతున్నారు. మొత్తం మీద కోట్లకు పడగలెత్తుతున్నారు. మరిన్ని మోసాలకు పాల్పడుతున్నారని  మాటలు వినిపిస్తున్నాయి.

Related posts

ఉత్త‌రాంధ్ర‌లో ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ప‌ర్య‌ట‌న‌

Satyam NEWS

పేకాట ఆడుతూ పట్టుబడ్డ వైసీపీ ఎమ్మెల్సీ కొడుకు

Satyam NEWS

అధికారం ఉంటే ఏదైనా చేస్తారా..?

Satyam NEWS

Leave a Comment