25.2 C
Hyderabad
October 10, 2024 20: 28 PM
Slider తెలంగాణ

దేశ రాజధానిలో కొనసాగుతున్న గ్రీన్ ఛాలెంజ్

santosh

దేశరాజధానిలో గ్రీన్ సవాల్ కొనసాగుతోంది. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇవాళ మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, కె.కేశవ రావు, బండ ప్రకాష్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి హరిత తెలంగాణ చేసారని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కితాబిచ్చారు. ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని చెప్పారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా 4.8 కోట్ల మొక్కలు నాటడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఎంపీ సంతోష్ కుమార్ ను ప్రకాష్ జవదేకర్ అభినందించారు.

Related posts

(NEW) What Over The Counter Medicines Are Good For Diabetes High Blood Sugar Drug’s Side Effect Goji Berry High Blood Sugar

Bhavani

మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థపై కేసు

Bhavani

కొత్త ఏడాది ప్రారంభంలో మంత్రి బొత్స కొత్త సందేశం…!

Satyam NEWS

Leave a Comment