38.2 C
Hyderabad
April 29, 2024 12: 09 PM
Slider నల్గొండ

కరోనా పరీక్షలు చేయించుకునేందుకు వెనుకాడవద్దు

#CoronaTest

కరోన పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు  ఎవరూ వెనుకాడ వద్దని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల MPP గూడెపు శ్రీనివాస్ కోరారు.

గురువారం హుజూర్ నగర్ నియోజకవర్గ మండల పరిధిలోని లింగగిరి గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్ష చేయించుకున్న అనంతరం MPP శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కరోనా  నియంత్రణకు  విస్తృత చర్యలు చేపట్టిందని తెలిపారు.

పరీక్షలు చేయించుకునేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో  ఏర్పాట్లు చేయడంతో పాటు  పాజిటివ్ వ్యక్తులకు అక్కడే మందులు అందిస్తున్నదని తెలిపారు.

వైద్య సిబ్బంది 17 రోజులు ఇంటిలో ఉంచి వారిని పర్యవేక్షిస్తున్నారని,  దీనివలన వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చని, భయపడకుండా అవగాహనతో  కరోనాను ఎదుర్కోవచ్చని అన్నారు.

మండల పరిధిలో హుజుర్ నగర్ ఏరియా వైద్య శాలలో, లింగగిరి గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  పరీక్షలు చేస్తున్నందున ఈ అవకాశం అందరూ ఉపయోగించు కోవాలని కోరారు.

ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్య సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో లింగగిరి మెడికల్ ఆఫీసర్ Dr. లక్ష్మణ్ గౌడ్,సూపర్వైజర్  పుల్లమ్మ, హెల్త్ అసిస్టెంట్  ఇందిరాల రామకృష్ణ,

సావిత్రి, స్వరూప, అలివేలు మంగ, జ్యోతి, సంతోషి తదితరులు పాల్గొన్నారు.

Related posts

అపర చాణుక్యుడు పీవీ

Satyam NEWS

నరేంద్ర మోడీ కార్పొరేట్ దోపిడిపై సేవ్ ఇండియా ప్రదర్శన

Satyam NEWS

కరోనా కట్టడి కోసం ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment