32.7 C
Hyderabad
April 27, 2024 00: 59 AM
Slider ఆంధ్రప్రదేశ్

రాజధానిపై టీడీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.277 కోట్లు

buggana

రాజధాని నిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వం నికరంగా చేసిన ఖర్చు కేవలం  చేసిన ఖర్చు రూ.277 కోట్లు మాత్రమే అని, అదే సమయంలో రాజధాని మొదటి దశ కోసం రూ.1.09 లక్షల కోట్లతో ప్రణాళిక రూపొందించారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లలో కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేసిన గత ప్రభుత్వం ఏకంగా రూ.52 వేల కోట్ల పనులకు టెండర్లు పిల్చిందని, ఆ ఖర్చు చేసిన రూ.5 వేల కోట్లు కూడా వివిధ వాణిజ్య బ్యాంకుల నుంచి అప్పు తెచ్చినవని ఆయన తెలిపారు.

రాజధాని నిర్మాణం పూర్తయ్యాక ఏటేటా ఆస్తులు అమ్మి ఏకంగా రూ.79 వేల కోట్ల ఆదాయం పొందుతామని గత ప్రభుత్వం ప్రకటించిందన్న ఆర్థిక మంత్రి, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ అంటే ఆస్తులు అమ్మడమేనా? అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధానిని ఏకంగా 8 వేల చదరపు కిలోమీటర్లతో ప్లాన్‌ చేశారని చెప్పారు. దేశంలో అతి పెద్ద వాణిజ్య నగరమైన ముంబై మెట్రోపాలిటన్‌ సిటీ పరిధి కూడా 6300 చ.కి.మీ. మాత్రమే అని, ఇక ఢిల్లీ నగర పరిధి 1300 చ.కి.మీ. కాగా, చెన్నై కార్పొరేషన్‌ పరిధి 426 చ.కి.మీ అని మంత్రి వెల్లడించారు.

అలాంటికి అమరావతి కోసం ఏకంగా 8000 చ.కి.మీ. పరిధి అవసరమా? అన్న ఆయన, ఇదేనా 40 ఏళ్ల రాజకీయ అనుభవం? అని నిలదీశారు. రాజధానిలో నిర్మించిన భవనాలు కూడా అన్నీ తాత్కాలికమే అని గుర్తు చేసిన ఆర్థిక మంత్రి, లోపభూయిష్టంగా ప్రజా ప్రతినిధులు, అధికారుల నివాసాల ఇళ్లు డిజైన్‌ చేశారని గురువారం సాయంత్రం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.

రాజధాని నోటిఫై చేయలేదని తమను నిందిస్తున్నారని, మరి నాలుగున్నర ఏళ్లు టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందని ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. ‘మేము వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు. గత ప్రభుత్వం దిగిపోతూ  అస్తవ్యస్త పరిస్థితి వదిలారు. వాటిని చక్కదిద్దడమే సరిపోతోంది. కానీ కేంద్రంలో అధికారం పంచుకున్న మీరు నాలుగున్నర ఏళ్లు, కనీసం రాజధానిని మ్యాప్‌లో పెట్టించలేకపోయారు’ అని బుగ్గన నిలదీశారు.

అవినీతిని మేము నిరూపించలేకపోతున్నామని అంటున్నారన్న ఆయన,  త్వరలోనే అది జరుగుతుందని వెల్లడించారు. ‘రాజధాని నిర్మించాక ఆస్తుల అమ్మకం ద్వారా రూ.79 వేల కోట్లు వస్తాయని గత ప్రభుత్వం చెప్పింది. అది కూడా 2017లో రూ.425 కోట్ల ఆస్తి అమ్మకం, 2023లో రూ.1295 కోట్లు, 2024 లో రూ.1834 కోట్లు, 2025లో రూ.2885 కోట్లు, 2026లో రూ.4681 కోట్లు.. ఆ విధంగా 2030 నాటికి రూ.7425    కోట్లు వస్తాయి. అలా 2037 వరకు ఇక్కడ ఉండే ఆస్తులు అమ్ముతారంట. అసలు ఏమిటిది? ఇదేమన్నా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమా?’ అని మంత్రి అడిగారు.

రాజధాని నిర్మాణంలో అసాధారణ స్థాయిలో ఖర్చు చేశారని మంత్రి పేర్కొన్నారు. ఒక్కో కిలోమీటరు రోడ్డుకు ఏకంగా రూ.46 కోట్లు ఖర్చు చేశారని, భవన నిర్మాణంలో ఒక్కో చదరపు అడుగుకు భూమి విలువ కాకుండా రూ.6995  చొప్పున లెక్క కట్టారని చెప్పారు. నిజానికి రూ.5 వేలకు ఒక్కో చదరపు అడుగు హైదరాబాద్‌లో భూమి విలువతో సహా కడతారని గుర్తు చేసిన ఆయన, అలాంటిది గత ప్రభుత్వం భూమి విలువ కాకుండా చదరపు అడుగుకు రూ.6995 చొప్పున కట్టిందని వివరించారు.

మీ ప్రణాళిక ప్రకారం రాజధాని మొదటి దశ నిర్మాణం కోసం రూ.1.09 లక్షల కోట్లు కావాలి. అందులో రూ.5 వేల కోట్లు బ్యాంకుల నుంచి తెచ్చారు. కానీ మీరు ప్రభుత్వ ఖజానా నుంచి కేవలం రూ.277 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇంకా చెప్పాలంటే రూ.1771.77 కోట్లు మీరు ఖర్చు పెడితే అందులో కేంద్రం నుంచి రూ.1500 కోట్లు వస్తే, మీరు ఖర్చు చేసింది కేవలం రూ.277 కోట్లు మాత్రమే. ఏటా ఇంతింత అమ్మకం చేస్తామంటూ దాన్ని సెల్ఫ్‌ ఫైనాన్స్‌ అంటున్నారు’ అని మంత్రి వివరించారు.

Related posts

Thank God: కులం రంగు పులిమే అవకాశం రాలేదు

Satyam NEWS

‘శాసనసభ’ నుంచి ‘నన్నుపట్టుకుంటే’ లిరికల్‌ వీడియో విడుదల

Bhavani

రఘురామకృష్ణరాజును డిస్ క్వాలిఫై చేయండి

Satyam NEWS

Leave a Comment