37.2 C
Hyderabad
May 2, 2024 14: 53 PM
Slider ముఖ్యంశాలు

గెస్ట్ లెక్చరర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్

#Telangana government

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,654 గెస్ట్ లెక్చరర్ల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసి లెక్చరర్లను ఎంపిక చేయాలని ఇంటర్‌ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పీజీ మార్కుల ఆధారంగా 1:3 నిష్పత్తిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మెరిట్ జాబితాను జులై 27న ప్రకటిస్తారు. తుది ఎంపిక జులై 28న చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 1 లోపు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.గెస్ట్ లెక్చరర్లు మొత్తం పోస్ట్‌లు: 1,654 ఉండగా జిల్లాల వారీగా ఖాళీలు ఇలా వున్నాయి.

సిరిసిల్ల-27, జనగామ -33, గద్వాల -40, వనపర్తి -48, భద్రాద్రి కొత్తగూడెం -45, సిద్దిపేట -69, కామారెడ్డి -78, నిజామాబాద్-58, మహబూబాబాద్-21, మెదక్-68, నాగర్‌కర్నూల్ -67, సూర్యాపేట -17, వికారాబాద్ -59, సంగారెడ్డి-101, మేడ్చల్-24, ఆసిఫాబాద్-61, వరంగల్-19, ఖమ్మం-42, హనుమకొండ -17, జగిత్యాల -51, కరీంనగర్-28, నల్గొండ-53, మంచిర్యాల-37, ఆదిలాబాద్ -63, పెద్దపల్లి- 42 ఖాళీలు వున్నాయి.

Related posts

తెలంగాణ లో రేపటి నుంచి స్కూళ్లు బంద్

Satyam NEWS

విద్యా శాఖ మంత్రి బొత్స కు కాలేజీ విధ్యార్ధుల మొర…

Bhavani

అంతర్ జిల్లా దొంగ అరెస్ట్

Murali Krishna

Leave a Comment