38.2 C
Hyderabad
May 5, 2024 19: 34 PM
Slider ఖమ్మం

అంటువ్యాదులు ప్రబలకుండా చర్యలు భద్రాచలం వద్ద

#Collector Priyanka Ala

వరద క్రమేపీ తగ్గుముఖం పడుతున్నందున అంటు వ్యాధులు ప్రబల కుండా పారిశుధ్య, వైద్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి కేటాయించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అల అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

వర్షాలు, వరదల వల్ల పేరుకుపోయిన వ్యర్థాలను తిలగించి బ్లీచింగ్ చేయాలని చెప్పారు. దోమలు వ్యాప్తి నియంత్రణకు మురుగునీటి నిల్వలు లేకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. నీటి నిల్వలున్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్, రసాయనాలు చల్లాలని చెప్పారు.

వ్యాధులు ప్రబల కుండా వైద్య క్యాంపులు నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. వ్యాదులు ప్రబలిన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య క్యాంపులు చేపట్టి వ్యాధులు ప్రబల కుండా నియంత్రణ చేయాలని చెప్పారు. ఏదేని అనారోగ్య సమస్య వస్తే జాప్యం చేయక ప్రజలు తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా చేయాలని చెప్పారు. సురక్షిత మంచి నీరు సరఫరా చేయాలని, అందుకు గాను మంచినీటి పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ఎక్కడైనా మంచి నీటి సమస్య వస్తే ఆయా ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా మంచి నీరు సరఫరా చేయాలని చెప్పారు. అత్యవసర సేవలకు ప్రజలు కంట్రోల్ రూములకు ఫోన్ చేయాలని చెప్పారు. సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు అధికార యంత్రాంగం కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

Related posts

రెడ్ ఎలర్ట్: నరసరాపుపేటలో కరోనా పాజిటీవ్

Satyam NEWS

భారీ వర్షాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలి

Satyam NEWS

రాజంపేట లో టీడీపీ సాధన దీక్ష…

Satyam NEWS

Leave a Comment