29.7 C
Hyderabad
May 3, 2024 04: 04 AM
Slider ప్రత్యేకం

బ్రేకింగ్ న్యూస్: మంత్రి కేటీఆర్ కు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసు

#Minister KTR Form House

తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. హిమాయత్ సాగర్ పరీవాహక ప్రాంతాన్ని పరిరక్షించేందుకు నిర్దేశించిన త్రిబుల్ వన్ జీవో (జీవో 111) ను ఉల్లంఘిస్తూ కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మించారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి గ్రీన్ ట్రిబ్యునల్ ఎదుట పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై వివరణ కోరుతూ మంత్రికి గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. మంత్రి కేటీఆర్ తో బాటు తెలంగాణ ప్రభుత్వానికి, కాలుష్య నియంత్రణ మండలికి, హెచ్ఎండిఏ కు కూడా గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. అంతే కాకుండా ఈ అంశంపై నిజనిర్ధారణ జరిపేందుకు ఒక ప్రత్యేక కమిటీని కూడా గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నది.

ఈ నిజనిర్ధారణ కమిటీకి కేంద్ర పర్యావరణ పరిరక్షణ విభాగం ప్రాంతీయ కార్యాలయం అధికారులు నేతృత్వం వహిస్తారు. ఇందులో సభ్యులుగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్ ఎంసి, జలమండలి, హెచ్ ఎం డిఏ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ రెండు నెలల్లో నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. కేటీఆర్ ఫామ్ హౌస్ తో బాటు జీవో 111 పై గతంలో తాము ఇచ్చిన తీర్పులు అమలు జరుగుతున్నాయా లేదా అనే అంశంపై కూడా ఈ కమిటీ విచారణ జరుపుతుంది.

Related posts

జర్నలిస్టులలో బలమైన శక్తిగా మారిన ఐజేయూ

Satyam NEWS

రాజధాని భూమిని ధారాదత్తం చేయడానికి నీకు ఏ హక్కు ఉంది?

Satyam NEWS

డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన జుక్కల్ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment