26.7 C
Hyderabad
May 12, 2024 08: 07 AM
Slider ప్రత్యేకం

రాజధాని భూమిని ధారాదత్తం చేయడానికి నీకు ఏ హక్కు ఉంది?

#raghurama

రాజధాని అమరావతి ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ కు భిన్నంగా కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్ల అభ్యర్థనతో 24 గంటల వ్యవధిలో 1100 చిల్లర ఎకరాల భూమిని జగనన్న ఇళ్ల స్థలాల  పంపిణీకి  సి ఆర్ డి ఏ  కమిషనర్ శ్రీలక్ష్మి  కేటాయించడం  ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని రఘురామకృష్ణంరాజు విస్మయం వ్యక్తం చేశారు. ఈ తరహా చెత్త ఆర్డర్లు ఇవ్వడానికి  శ్రీ లక్ష్మీ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ప్రభుత్వ పెద్దలు కడుపుమంటతోనే ఇదంతా  చేస్తున్నారు.

సుప్రీం కోర్టులో  రాజధాని కేసు వాదించడానికి వందల కోట్లు వెచ్చించి న్యాయవాదులను నియమించుకొని, కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకొని  కూడా తమ పంతాన్ని నెగ్గించుకోలేకపోయామనే అక్కసుతోనే రైతులను వేధించాలనే ఉద్దేశ్యంతోనే రాజధాని ప్రాంతంలో  ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయించారు. మాస్టర్ ప్లాన్ కు భిన్నంగా  ఎటువంటి నిర్ణయాలను తీసుకోరాదని  ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తప్పును ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలకు ప్రస్తుతం ఓట్ల భయం పట్టుకుంది.

ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తామంటే చంద్రబాబు నాయుడు, ఆ దత్త పుత్రుడు అడ్డుకుంటున్నారని… పేదలకు ఇల్లు ఇవ్వడం మంచిదా?, ఆపడం మంచిదా అంటూ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రజల్లో తప్పుడు ప్రచారాన్ని  చేశారని గుర్తు చేశారు . పేదవారు సినిమాని చూడడానికి టికెట్ల ధరలను తగ్గిస్తే చంద్రబాబు నాయుడు ఎన్ని మాటలు అంటున్నారోనని దొంగ ఏడుపులు ఏడ్చిన జగన్మోహన్ రెడ్డి, సినిమా నిర్మాతలు,  హీరోలు వచ్చి కలిసి మాట్లాడిన తరువాత డీల్ సెట్ అవ్వగానే  పేదలంతా ధనవంతులైనట్టుగా  సినిమా టికెట్ల ధరలను పెంచేశారు.

ఎవరికి తెలువవు ప్రభుత్వ పెద్దల వెధవ స్టంట్ లు.. మీరు మారరని అందరికీ తెలుసు. రాజధాని కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ,  సుప్రీంకోర్టు కూడా కేసు కొట్టివేయడం ఖాయమని ముఖ్యమంత్రి కి అర్థమయిపోయింది. అందుకే రాజధాని అమరావతి ప్రాంతంలో 80 వేల ప్లాట్లను పంపిణీ చేయాలని, తద్వారా ఈ ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. కృష్ణా,  గుంటూరు జిల్లాలో పనిచేసుకునే వారికి  రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలను ఇస్తే ప్రయోజనం ఏమిటి?.  వారు ఇక్కడకు వచ్చి ఏ పని చేసుకుని బ్రతుకుతారు.

ఎక్కడి వారికి అక్కడే  ఇళ్ల స్థలాలను ఇస్తే  వారి ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ఉంటాయి. అంతేకానీ ఇతర ప్రాంతాలకు చెందిన వారిని తీసుకువచ్చి రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలను ఇస్తామనడం పాలకుల దుర్బుద్ధి ఏమిటో అర్థమవుతూనే ఉంది. రాజధాని నిర్మాణానికి విముఖంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఈ ప్రాంత అభివృద్ధిని నిలిపివేశారు. ఆయన అణుంగు అనుచరులు రోడ్లను తవ్వేసి కంకర, ఇసుకను అమ్ముకోగా, మిగిలిన స్టిల్ ను కూడా  విక్రయించి సొమ్ము చేసుకున్నారు. రాజధాని ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్న కుట్రలిక చెల్లవు.

ప్రతిపక్షాలు మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాయని, పాలక పక్షం చేస్తున్న  ఈ దుశ్చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజధాని ప్రాంతంలో  1150 ఎకరాల భూమిని ఏ హక్కు ఉన్నదని మీ బాబుగాడి సొమ్ములా ధారా దత్తం చేయాలని  చూస్తున్నారంటూ రఘురామకృష్ణంరాజు నిలదీశారు. గత నాలుగేళ్ల క్రితం రెండు లక్షల టిడ్కో ఇల్లు 90% పూర్తయితే, ఇప్పటివరకు  ఒక్క ఇంటి నిర్మాణాన్ని కూడా పూర్తిచేసి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేయలేదు.

రాజధాని ప్రాంతంలోనే గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టగా, వాటిని పూర్తి చేసి  లబ్ధిదారులకు అందించాలనే  సృహ కూడా లేని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పేదలు గుర్తుకు రావడం  ఆశ్చర్యకరం. ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసుల చేత దాడులు చేయించడం  ఈ ప్రభుత్వంలో నిత్య కృత్యమైపోయింది. ప్రభుత్వ ధమన నీతిని ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలు  ఆహో… ఓహో అంటూ సర్వేలలో చెబుతున్నారని భ్రమ లో ఉన్న  జగన్మోహన్ రెడ్డికి  ఎన్నికల్లో వారే తగిన గుణపాఠం నేర్పుతారు. గత నాలుగేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఇళ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేదు. ఏ ఒక్క లబ్ధిదారునికి  ఇంటిని నిర్మించి ఇవ్వలేదు .

గతంలో తామే ఇంటి నిర్మాణం చేయించి ఇస్తామని చెప్పినా ముఖ్యమంత్రి ఆ తరువాత మాట మార్చి, ఇళ్ళ నిర్మాణాన్ని మీరే చేసుకోండి అని లబ్ధిదారులకు  సూచించారు. ప్రభుత్వ ఇళ్ల స్థలాల పంపిణీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది.   రాజధాని ప్రాంత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి  కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఇళ్ల స్థలాల పంపిణీలో  దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలను  అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు దోచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు అత్యంత హేయం.. అత్యంత అమానుషత్వం… రాక్షసత్వాన్ని మించిన పైశాచికత్వం.

పిశాచాలు,  రాక్షసులు కూడా మన వైసీపీ  ముష్కరుల ముందు పనికిరారు. రాజమౌళి చిత్రంలోని  కాలకేయులను మన వైసీపీ కింకకరులు మించిపోయారు. వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై రాజధాని రైతులు హౌస్ మోషన్ మూవ్ చేయనున్నట్లు తెలిసింది. ప్రభుత్వ నిర్ణయంపై కచ్చితంగా న్యాయస్థానం స్టే ఇస్తుంది. మళ్లీ న్యాయస్థానానికి  ప్రభుత్వం తరఫున సుధాకర్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ వెళ్లి, తమ వాదనలను  ప్రధాన న్యాయమూర్తి వినాలని కోరుతారెమో .

ప్రభుత్వ నిర్ణయం పై న్యాయస్థానం స్టేను ఇస్తే, ఆ స్టే ను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం  సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో  రాజధాని కేసును జూలై 11 వ తేదీన విచారిస్తామని ఇప్పటికే చెప్పారు. దానితో కలిసి ఈ కేసును వింటామని చెబితే, ఈలోగానే రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ప్రభుత్వం పిచ్చిపిచ్చి ప్రయత్నాలు చేస్తే ప్రజలు ఊరుకుంటారా?, లేకపోతే గుడ్డలూడదీసి కొడుతారా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది. రాష్ట్ర హైకోర్టు  ఎంతవరకు సహకరిస్తుంది అన్నది చూడాలి.

లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించి ప్రత్యేక కేసుగా పిటిషన్ దాఖలు చేద్దాం. రాజధాని ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా ప్లాట్లు పంపిణీ చేసి, పాకలు వేయిద్దామని  చూస్తున్న ముఖ్యమంత్రి నిర్ణయం పై మాటలను అదుపులో పెట్టుకుని పొదుపుగా  మాట్లాడుతూ న్యాయ పోరాటం చేద్దామని రాజధాని రైతులకు రఘురామకృష్ణంరాజు సూచించారు. హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టులోనైనా న్యాయమే గెలుస్తుంది.  రాజధాని నిర్మాణానికి పొలాలనిచ్చిన రైతులకు ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదు.

రాజధాని అభివృద్ధి పై మంత్రులు ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడుతున్నారు. సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి  మరొక అడుగు ముందుకు వేసి తనకు  ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మంత్రులు,  ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్న మాటలతో ఆవేదనకు గురైన ఎంతో మంది రైతులు ఇప్పటికే ఆందోళనతో మృతి చెందారు. రాజధాని రైతుల మరణాలన్నీ ఈ ప్రభుత్వం చేసిన హత్యలే. ఆత్మ సిద్ధాంతం అన్నది కనుక నిజమైతే, రాజధాని ప్రాంత రైతుల ఆత్మలు ఈ ప్రభుత్వ పెద్దలను వదిలిపెట్టవు.

పాపం చేసిన వాడు తాత్కాలికంగా సుఖపడవచ్చు కానీ ఆ తరువాత అతను తగిన  శిక్షను అనుభవించవలసిందేనని ఆయన అన్నారు. ఇకనైనా మీ ఉన్మాదాన్ని ఆపండి. విశాఖలో వేల ఎకరాల భూములను కబ్జా చేశారు. ఆ భూములను పేదలకు పంచండి. రాజధాని అమరావతి ప్రాంతం పై  కక్షతో ఫ్యాక్షనిస్టు మనస్తత్వంతో ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఈ పార్టీలో కొనసాగడానికి అసహ్యం వేస్తోంది. ఈ పదవీ ద్వారానే పేదలకు సహాయం చేయగలను.

అందుకే ఈ పార్టీలో కొనసాగుతున్నాను. ఈ పదవి నువ్వు ఇచ్చింది కాదు… నేను తెచ్చుకున్నది. నీ ముఖం చూపించి ఓట్లు అడగలేదు. నా ముఖము చూపించే ఓట్లు అడిగాను. నా ముఖముతోనే నెగ్గాను. ఈ పార్టీలో ఉండడానికి సిగ్గు పడుతూనే ఉంటాను. చేసిన తప్పుకు నన్ను నేనే తిట్టుకుంటూ, పార్టీలో కొనసాగుతాను. ఈ పార్టీలో ఉండడానికి  నాకు సిగ్గు లేదు. ఉంచుకోవడానికి మీకు సిగ్గు లేదని  జగన్మోహన్ రెడ్డి పై  రఘురామ కృష్ణంరాజు ఫైర్ అయ్యారు.

Related posts

అంచనాలు పెంచిన సుధీర్ బాబు ‘హంట్’ టీజర్

Satyam NEWS

బాసర సరస్వతీ అమ్మవారికి పట్టు వస్త్రాలు

Satyam NEWS

కరోనాతో మృతి చెందిన వీడియో జర్నలిస్ట్ కుటుంబానికి సాయం

Satyam NEWS

Leave a Comment