26.7 C
Hyderabad
May 3, 2024 09: 30 AM
Slider నల్గొండ

ఘనంగా గుఱ్ఱం జాషువా 136 వ జయంతి వేడుకలు

#gurramjashua

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 11వ వార్డులో బయ్యారపు రామారావు అధ్యక్షతన గుఱ్ఱం జాషువా 136వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ముందుగా గుఱ్ఱం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ జాషువా 1895 సెప్టెంబర్ 28న,గుంటూరు జిల్లా వినుకొండ లో జన్మించారని,తన విద్యాభ్యాసాన్ని వినుకొండ,గుంటూరు లో సాగించారని అన్నారు. నవయుగ కవిగా,కవి చక్రవర్తి గా పేరు గడించిన జాషువా కు పద్మభూషణ్ బిరుదునిచ్చి సత్కరించారని అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడుగా నియమితులయ్యారని, 30కి పైగా రచనలు చేసిన జాషువా అంటరానితనం,స్త్రీల స్వేచ్ఛ కోసం, సమాజంలోని మూఢాచారాలు రూపుమాపేందుకు తన కలాన్ని ఆయుధంగా చేసుకుని ఎన్నో రచనలు చేశారని అన్నారు.1941లో జాషువా రచన రచనల్లో ‘గబ్బిలం’ సర్వోన్నతమైనదని, ఫిరదౌసి,కోకిల,రుక్మిణీ కళ్యాణం, గిజిగాడు,సూర్యోదయం,భారత వీరుడు, చంద్రోదయం,మాతృప్రేమ,శిల్పి వంటి అనేక రచనలు చేశారని అన్నారు.

ఈ కార్యక్రమంలో చింత్రిర్యాల నాగయ్య, కస్తాల శ్రవణ్ కుమార్,మందా వేంకటేశ్వర్లు,కస్తాల ముత్తయ్య, బయ్యారపు రవీంద్ర,మీసాల జనార్దన్, ఎడవేల్లి వీరబాబు, చింతిర్యాల నాగేంద్ర,కత్తి సుగుణ,మాదాసు సైదమ్మ,మీసాల రాములమ్మ,కస్తాల వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

కరెంటు మీటర్ రీడర్స్ కు నిత్యావసరాలు పంపిణీ

Satyam NEWS

గుర్రంపోడు గిరిజన రైతుల పోరాటానికి బిజెపి సంపూర్ణ మద్దతు

Satyam NEWS

కోట్లలో వ్యాపారం: ప్రభుత్వ ఆదాయానికి గండి: వినియోగదారుల లూటీ

Satyam NEWS

Leave a Comment