28.7 C
Hyderabad
April 27, 2024 06: 02 AM
Slider ఆదిలాబాద్

కరోనా ఫియర్: నిర్మల్ పట్టణంలో హైఎలర్ట్

nirmal collector 021

ఢిల్లీ మార్కజ్ కు వెళ్లి వచ్చిన నిర్మల్ పట్టణానికి చెందిన వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో మరణించినందున కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మరణించిన నిర్మల్ పట్టణానికి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు తీసుకోవాల్సిన చర్యలు గురించి జిల్లా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

నిర్మల్ పట్టణంలోని అన్ని వీధులను హైపో క్లోరైడ్ వాటర్ తో శుభ్రం చేయించాలని మున్సిపల్ కమిషనర్, జిల్లా అగ్నిమాపక దళ అధికారిగా ఆదేశించారు. ఢిల్లీ మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తి విమానయాన ప్రయాణం, శంషాబాద్ నుండి నిర్మల్ కు కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులకు వారి కుటుంబ సభ్యులను కోరంటైన్ లో ఉంచాలన్నారు.

తొలుత చికిత్స చేసిన ఆర్ఎంపీ డాక్టర్ వారి వివరాలను సేకరించడం తో పాటు వారి రక్త శాంపుల్ కోవాలని కారోనా వైరస్ నోడల్ అధికారి డాక్టర్ కార్తీక్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, జిల్లా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ లను కలెక్టర్ ఆదేశించారు.

జోహార్ నగర్ పరిధిలోని అర కిలో మీటర్ దూరంలో ఉన్న ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా 144 సెక్షన్ అమలు చేయాలని నిర్మల్ ఆర్డిఓ ను, జోహార్ నగర్ ప్రజలు బయటకు రాకుండా సీజ్ చేయాలని, పోలీసు బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు.

జోహార్ నగర్ లోని ప్రజలకు నిత్యావసర సరుకులు రేషన్ బియ్యం, కూరగాయలు వారి ఇంటి వద్దనే అందించాలని జిల్లా పౌరసరఫరాల అధికారి ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు, జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు, అదనపు ఎస్పీలు శ్రీనివాసరావు, వెంకట్ రెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వసంతరావు పాల్గొన్నారు.

ఇంకా జిల్లా ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, ఆర్ డి ఓ ప్రసూనాంబ, డాక్టర్ కార్తీక్, జిల్లా ఫైర్ ఆఫీసర్ , నిర్మల్ డిఎస్పి ఉపేందర్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

కల్లు గీత కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమమే

Satyam NEWS

రోడ్డు వెడల్పు లో ప్రజా ప్రతినిధుల కుమ్మక్కు రాజకీయాలు

Bhavani

మురుగు కాల్వ సుందరీకరణకు 10 కోట్లు

Bhavani

Leave a Comment