31.7 C
Hyderabad
May 2, 2024 10: 44 AM
Slider విజయనగరం

మున్సిపల్ కార్మికుల సమ్మెకు సిపిఐ సంపూర్ణ మద్దతు

#aituc

మున్సిపల్ కార్మికుల 3 రోజులుగా చేస్తున్న సమ్మెకు సిపిఐ సంపూర్ణ మద్దతుగా నిలుస్తోందని, సీఎం జగన్ పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించకపోతే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పి. కామేశ్వరరావు హెచ్చరించారు.

మున్సిపల్ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులు మూడవ రోజు రాష్ట్ర వ్యాప్త సమ్మె లో బాగంగా  విజయనగరం లో కన్యకాపరమేస్వరీ ఆలయం కూడలిలో రాస్తారోకో చేసి అక్కడ నుంచి భారీ ఎత్తున అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి గంట స్థంభం దగ్గర  రాస్తారోకో నిర్వహించారు. అనంతరం విజయనగరం మున్సిపల్ నగర కార్యాలయం దగ్గర ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్. రంగరాజు అధ్యక్షతన సమావేశంలో పి.కామేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పట్ల సీఎం జగన్ కి నిర్లక్ష్యం తగదని అన్నారు.

11వ పీఆర్సీ ప్రకారం పెరిగిన వేతనాలు అమలు చేయడం లేదన్నారు, సీఎం జగన్ వాగ్దానం మేరకు అమలు చేస్తున్న హెల్త్ అలవెన్సు 6 నెలలు తరబడి దాన్ని అమలు చేయకుండా బకాయి పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. మున్సిపల్ కార్మికులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని ప్రభుత్వం ఇచ్చిన జీఓల ప్రకారం స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులకు అమలు చేయాల్సిన వేతనాలు అమలు కానందున కార్మికులు తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెలోకి రావాల్సిన పరిస్థితి ప్రభుత్వమే తీసుకోచిందన్నారు.

మీరు చెప్పే మాయమాటలకి మరోసారి మోసపోవడానికి కార్మికులు సిద్ధంగా లేరన్నారు. కార్మికుల రక్షణ పరికరాలు వంటి కనీస సమస్యలను కూడా పరిష్కరించడం లేదని గడచిన మూడేళ్ళ లో ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదన్నారు. కరోనా సమయంలో విధులు నిర్వహిస్తు ప్రాణాలు కోల్పోయారని ఏ ఒక్కరి కూడా కరోనా వారియర్స్ కింద ప్రమాద బీమా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏఐటీయూసీ జిలా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకి లక్షల్లో వేతనాలు పెంచుకుంటూపోతున్నారు కానీ ఎండనక, వాననక, పగలనక, రాత్రనక, ప్రకృతి, భయంకరమైన రోగాల విలయతాండవంలో కూడా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తు ప్రజారోగ్యాన్ని కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికులకి కేవలం  21 వేల వేతనం ఇవ్వడానికి మీకు చేతులు రావడం లేదా అని ప్రశ్నించారు.

రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు వారి పిల్లలకి, మరణించిన కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వకపోవడం చాలా దారుణం ఆగ్రహం వ్యక్తంచేశారు. పట్టణ విస్తరణ పెరుగడం వలన పనిభారం తీవ్రంగా పెరుగుతుందని అందుకే కార్మికుల సంఖ్యను పెంచండని ఎన్నిసార్లు అడిగినా తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తూ కార్మికుల సంఖ్య పెంచడం లేదని మండిపడ్డారు. మున్సిపల్ కార్మికులు చేస్తున్న డిమాండ్స్ ప్రభుత్వం పరిష్కరించలేని డిమాండ్స్ మాత్రం కాదు కానీ కమిటీల పేరుతో తత్సారం చేస్తున్నారని విమర్శించారు.

మున్సిపల్ రంగంలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు, వాహన డ్రైవర్లకి హెల్త్ అలవెన్స్ ఇవ్వాల్సిందేనని అన్నారు. పనిభారం తగ్గించాలని, కార్మికులను పర్మినెంట్ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి ఆప్కాస్ విధానం నుండి కార్మికులను మినహాయించాలని, పర్మినెంట్ కార్మికులకి సరెండర్ లీవులు, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మెతో పారిశుద్ధ్యం పని స్తంభించే పరిస్థితి ఉందన్నారు.

ఈ వర్షాకాలంలో వీధుల్లో చెత్త, చెదారం పేరుకుపోయిన ప్రజలు ఇబ్బందులు, అనారోగ్యపాలయ్యే ప్రమాదం ఉందని. తక్షణమే మంత్రులు, అధికారులు వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలను మున్సిపల్ రంగంలోని జేఏసీ తో చర్చించి పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జలగడుగుల కామేష్, ఏ.ఐ.ఎస్.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. నాగభూషణం, జిల్లా కార్యదర్శి బి.వాసు, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు వి.రాజేష్ లు మద్దత్తు తెలిపారు. సంతోష్, తుపాకుల శ్రీను, కళ్యాణ్ శ్రీను, దలాయ్ శ్రీను, కోడూరు. చిరంజీవి, జె. భాస్కరరావు, డి.సత్తిబాబు, కిషోర్ మరియు మహిళా కార్మికులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం: ఎమ్మెల్యే చిరుమర్తి

Satyam NEWS

పెన్షనర్ల ఉసురు పోసుకో వద్దు

Satyam NEWS

సమాధులు తొలగించినందుకు అందరూ క్షమించండి

Satyam NEWS

Leave a Comment