28.7 C
Hyderabad
April 27, 2024 03: 19 AM
Slider వరంగల్

కాకతీయ వర్సిటీలో జిమ్ సౌకర్యం ఏర్పాటు చేయాలి

కాకతీయ విశ్వవిద్యాలయం ఉమెన్స్ హాస్టల్ విద్యార్థుల సౌకర్యార్ధం ఓపెన్ జిమ్, సానిటరీ నాప్ కిన్స్ క్రషర్ ను ఏర్పాటు చేయాలని వినియోగదారుల హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్, అనురాగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి కోరారు. ఈ మేరకు నేడు హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారని అనితారెడ్డి తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయం లో వినియోగదారుల హక్కుల చట్టం పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంలో అక్కడ ఈ అవసరాన్ని గుర్తించామని ఆమె తెలిపారు. ఒపెన్ జిమ్, సానిటరీ నాప్ కిన్స్ క్రషర్ ఎంతో అవసరమని అక్కడి విద్యార్ధులు కోరినట్లు ఆమె తెలిపారు. ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినట్లు అనితారెడ్డి తెలిపారు.

Related posts

వెలుగులోకి వస్తున్న ఉపాధి హామీ అక్రమాలు

Bhavani

రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టి.యన్. ఎస్.ఎఫ్. నిరసన

Satyam NEWS

ప్రజలకు ఉపయోగపడే పనులకే ప్రాధాన్యత

Murali Krishna

Leave a Comment