28.7 C
Hyderabad
April 28, 2024 04: 37 AM
Slider నల్గొండ

ప్రపంచంలోనే అతిపెద్ద మానవ ప్రయత్నం తెలంగాణ హరితహారం

#hujurnagar mla

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామ పంచాయితీ పరిధిలో మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద బృహత్ మెగా పల్లె ప్రకృతి వనం శంకుస్థాపన కార్యక్రమనికి శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ గ్రామ గ్రామాన సర్పంచులు,ప్రజా ప్రతినిధులు కష్టపడి పనిచేస్తూ సిఎం కెసిఆర్ ఆశించిన రీతిలో పల్లె ప్రగతిని నిర్వహించడం జరుగుతుందని,పల్లె ప్రగతి దేశానికే ప్రగతి అని నమ్మిన నాయకుడు కెసిఆర్ ని,ప్రతి ఒక్కరు గ్రామంలో అభివృద్ధి పనులపై అహర్నినిశలు కృషి చేస్తున్నారని అన్నారు.

నాటిన మొక్కల్లో 85% కాపడుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.దురదృష్టవశాత్తు చనిపోయిన వారిని ఖననం చేయడానికి కూడా స్థలం దొరకని కాలంలో ప్రతి గ్రామ పంచాయతీకి వైకుంఠధామాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుంచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడం వల్ల  గ్రామ పంచాయతీలకు మంచి పేరు తెచ్చిపెడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్  వినయ్ కృష్టరెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట రెడ్డి, ఎంపిపి పెండేం సుజాత శ్రీనివాస్ గౌడ్,సర్పంచ్ నాగేశ్వరావు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

తొలి కేసును చేధించిన సైబ‌ర్ క్రైమ్ పోలీసులు…!

Satyam NEWS

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తహశీల్దార్ల బదిలీలు

Satyam NEWS

విధి నిర్వహణలో మానవీయకోణం తో పనిచేయాలి

Satyam NEWS

Leave a Comment