29.7 C
Hyderabad
May 3, 2024 05: 00 AM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తహశీల్దార్ల బదిలీలు

kcr45

రాష్ట్ర వ్యాప్తంగా తహశీల్దార్ల సొంత జిల్లాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ 2018 లో ఇతర జిల్లాలకు తహశీల్దార్లు బదిలీ అయిన విషయం తెలిసిందే. తమను సొంత జిల్లాలకు పోస్టు చేయాలని తహశీల్దార్లు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ప్రత్యామ్నాయాల కోసం వేచి చూడకుండా తహశీల్దార్లను వెంటనే సొంత జిల్లాలకు రిలీవ్ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా వెళ్లాయి. జోన్ 5 లో 166 మంది, జోన్ 6 లో 212 మంది, మొత్తం 378 మంది తహశీల్దార్ల రిపాట్రియేషన్ చేశారు. తహశీల్దార్ల రిపాట్రియేషన్ ప్రొసీడింగ్స్ ను సీసీఎల్ఏ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ విడుదల చేశారు. రిపాట్రియేట్ అయిన తహశీల్దార్లు రేపటికల్లా జిల్లా కలెక్టర్లకు రిపోర్ట్ చేయాలని సూచన. రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ ను ట్రెసా ఆఫీస్ బేరర్లు కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

నెల్లూరు కోర్టులో చోరీ న్యాయవ్యవస్థకే మాయని మచ్చ

Satyam NEWS

కంటి వెలుగు ఇంటికే వెలుగు

Murali Krishna

ప్రపంచం మొత్తం…. మాంద్యానికి దగ్గరగా..

Satyam NEWS

Leave a Comment