37.2 C
Hyderabad
May 2, 2024 14: 45 PM
Slider నిజామాబాద్

పండగలా ప్రారంభమైన హరితహారం పల్లె ప్రగతి కార్యక్రమం

#jukkal mla

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో హరితహారం పల్లె ప్రగతి కార్యక్రమం పండుగలా ప్రారంభమైంది. ముందుగా జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే జుక్కల్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలు ప్రతి గ్రామాలలో హరిత విప్లవం గా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని, దానితోపాటు గ్రామాల పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని, సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు సర్పంచులకు ఆయన సూచించారు.

వర్షాకాలం కావున సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశముందని అందులో ముఖ్యంగా ప్రస్తుతం కరోనాతో ఇప్పటికే కొట్టుమిట్టాడుతున్నా మన్నారు.

ప్రతి ఒక్కరూ భౌతిక సామాజిక దూరం పాటించి తప్పకుండా మాస్కులు ధరించి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

జుక్కలు మండలంలో ఆయనతో పాటు ఎంపీపీ యశోదా బాయి, జెడ్పీటీసీ లక్ష్మీబాయి,మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయాగౌడ్, పాల్గొనగ ,బిచ్కుందలో ఎంపిపి అశోక్ పటేల్ ,ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,

పిట్లంలో ఎంపిపి కవిత విజయ్,జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి,పెద్ద కొడపుగల్లో ఎంపీపీ ప్రతాప్రెడ్డి,జడ్పీటీసీ చంద్రభాగా,మద్నూర్లో ఎంపీపీ లక్ష్మీబాయి, జెడ్పీటీసీ అనిత,నిజాంసాగర్ లో  ఎంపీపీ పట్లోళ్ల విజయ, జెడ్పీ చైర్పర్సన్ శొభ ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

స్కిల్ డెవలప్ మెంట్ లో మహిళలకు 30 రోజుల శిక్షణ

Satyam NEWS

రెండో ఏఎన్ఎంలు మోకాళ్లపై నిరసన.

Bhavani

భారతమ్మ బతికి ఉంటేనే కదా ప్రతి రోజూ పండుగ

Satyam NEWS

Leave a Comment