31.7 C
Hyderabad
May 2, 2024 07: 45 AM
Slider హైదరాబాద్

హైదరాబాద్ సింగరేణి కాలనీ లో ఉచిత మల్టిస్పెషలిటీ వైద్య శిబిరం

#Singareni

సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాదులోని సరూర్ నగర్ ప్రాంతంలోగల సింగరేణి కాలనీ లో రిటైర్డ్ ఉద్యోగులు ,అధికారుల కోసం ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ,సింగరేణి సేవా సమితి ఉపాధ్యక్షుడు కే. రవి శంకర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ ప్రతి ఏడాది రు. 40 కోట్లకు పైగా వెచ్చించి సామాజిక బాధ్యత కార్యక్రమాలను నిర్వహిస్తోందని, వీటిలో సమీప గ్రామాల ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలు ప్రతి నెల నిర్వహిస్తోందన్నారు .

సింగరేణి సంస్థకు విశేష సేవలందించి రిటైరైన అధికారులు ,ఉద్యోగుల కోసం వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. పదవీ విరమణ చేసిన అధికారులకు ఉద్యోగులకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడం కోసం సి పి ఆర్ ఎస్ కార్డులను ఇప్పటికే పంపిణీ చేశామని ,ఈ అవకాశాన్ని హైదరాబాదులో ఉన్న ఆస్పత్రిలలోనే కాక వరంగల్, కరీంనగర్, విజయవాడ,  విశాఖపట్నం గుంటూరు వంటి ప్రాంతాల్లో సింగరేణి తో వైద్యసేవలు ఒప్పందం గల ఆసుపత్రులు ఆ ప్రాంతాలలో నివసిస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు  వినియోగించుకోవచ్చు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెసిడెంట్ డాక్టర్ బాలకోటయ్య ,డాక్టర్ శివకుమార్, రిటైర్డ్ అధికారుల సంఘం నాయకులు కె ఆర్ సి రెడ్డి  విశ్వేశ్వరరావు ,జి.ఐలయ్య తదితరులు పాల్గొన్నారు . వైద్య సేవల కోసం 10 ప్రత్యేక కౌంటర్లు ..రోగుల కోసం పెద్దయెత్తున టెంట్లు ఏర్పాటు చేశారు .శిబిరం లో పాల్గొన్న అందరికీ కరోనా రాపిడ్ పరీక్షలు నిర్వహించారు.

సేవా సమితి సింగరేణి వ్యాప్త కోఆర్డినేట్ ఈ అధికారి చీఫ్ లైజన్   ఆఫీసర్ బి మహేష్ ,అడిషనల్ మేనేజర్ డి వెంకటేశం ,అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ భాస్కర్ ల ఆధ్వర్యం లో ఏర్పాట్లు చేశారు  . మొత్తం 400 మంది కి ఉచిత వైద్య సేవలు అందించారు .శ్రీ సాయి సంజీవిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మెడి విజన్,  డాక్టర్ మోహన్స్ డయాబెటిస్..సౌజన్య డెంటల్ ఆసుపత్రుల సంబంధించి కు చెందిన వైద్యులు, సిబ్బంది వివిధ రకాల పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు .సేవా సమితి ద్వారా మందులను కూడా పంపిణీ చేయడం జరిగింది.

Related posts

అటవీ భూముల ఆక్రమణ కుదరదు

Murali Krishna

సమగ్ర శిక్ష లో పేరుకు పార్ట్ టైం, పనిచేస్తుంది ఫుల్ టైం

Satyam NEWS

అనంతపురం టవర్‌క్లాక్‌ బ్రిడ్జి రెడీ

Bhavani

Leave a Comment