30.7 C
Hyderabad
April 29, 2024 06: 01 AM
Slider ముఖ్యంశాలు

మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి విషమం

#Mogiliah suffered a heart attack

బలగం సినిమా క్లైమాక్స్‌ పాటతో ప్రేక్షకుల దృష్టి మొత్తం తనవైపు తిప్పుకున్న కళాకారుడు మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కొంతకాలంగా రెండు కిడ్నీలు పాడవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్‌లోని ఓ ఆసుపత్రిలో డయాలసిస్ నిర్వహిస్తుండగా, మొగిలయ్యకు గుండెపోటు వచ్చింది.

దీంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొగిలయ్య ఇప్పటికే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. తమను ప్రభుత్వం ఆదోకోవాలని మొగిలయ్య భార్య కొమురమ్మ వేడుకుంటోంది. బలగం సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Related posts

బాలలు దేశంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలి

Satyam NEWS

ప్రజాపంథా నేత రాయల మృతి

Murali Krishna

ఏప్రిల్ 2 న తెలుగులో వస్తున్న “లెగసి ఆఫ్ లైస్”

Satyam NEWS

Leave a Comment