40.2 C
Hyderabad
May 2, 2024 16: 43 PM
Slider ప్రత్యేకం

పెరగనున్న వీసా ఫీజులు

#United States

విదేశీ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారులు, వృత్తిదారుల వీసా దరఖాస్తు ఫీజులను 15 నుంచి 110 డాలర్ల మేరకు పెంచుతున్నట్టు అమెరికా ప్రకటించింది. స్టూడెంట్‌, విజిటర్‌ వీసాలతోపాటు ఇతర నాన్‌-పిటిషన్‌ బేస్డ్‌ నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసా ఫీజులను ప్రస్తుతమున్న 160 డాలర్ల నుంచి 185 డాలర్లకు పెంచుతున్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది.

వీటితోపాటు తాత్కాలిక వృత్తిదారులకు ఇచ్చే కొన్ని రకాల నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసా ఫీజును 190 నుంచి 205 డాలర్లకు, ప్రత్యేక వృత్తి నిపుణులకు ఇచ్చే వీసా ఫీజును 205 డాలర్ల నుంచి 315 డాలర్లకు పెంచుతున్నట్టు పేర్కొన్నది. కొత్త వీసా ఫీజులు ఈ ఏడాది మే 30 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. దీంతో అమెరికా యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందిన భారతీయ విద్యార్థులు వీసా కోసం రూ.14 వేలకుపైగా చెల్లించాల్సి ఉంటుంది.

Related posts

బి ఫార్మసీ విద్యార్ధుల కథ విషాదాంతం: ప్రేమ జంట ఆత్మహత్య

Satyam NEWS

బడిబయట విద్యార్థులను గుర్తిస్తున్న సమగ్ర శిక్ష ఒప్పంద అధ్యాపకులు

Satyam NEWS

నిరాధార కుటుంబాన్ని ఆదుకున్న ప్రియనేస్తం చారిటబుల్ ట్రస్ట్

Satyam NEWS

Leave a Comment