26.7 C
Hyderabad
May 3, 2024 08: 43 AM
Slider రంగారెడ్డి

ఇలాంటి పిల్లవాడు ఊరికి ఒక్కడు ఉంటే చాలు…..

GreenBealt

హైదరాబాద్, సైదాబాద్ ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి అడ్డువస్తోందని స్థానికులు ఓ భారీ వేపచెట్టును కొట్టేశారు.

సుమారు నలభై ఏళ్ల వయస్సు ఉండే వేప చెట్టును రాత్రికి రాత్రి కొట్టేయటంతో పాటు, ఆనవాళ్లు కనిపించకుండా కలపను తరలించటం, చెట్టు ఆనవాళ్లను తగులబెట్టే ప్రయత్నం కూడా చేశారు.

తెల్లవారు జామున జరిగిన ఈ వ్యవహారాన్ని గమనించిన ఓ ఎనిమిదవ తరగతి విద్యార్థి అటవీ శాఖ టోల్ ఫ్రీ నంబర్ (1800 425 5364) కు ఫోన్ చేశాడు.

తాను గ్రీన్ బ్రిగేడియర్ ను అని పరిచయం చేసుకుని, తమ ఇంటి సమీపంలో పెద్ద చెట్టును కొట్టేసిన వారిపై చర్య తీసుకోవాలని కోరాడు.

విచారణ చేపట్టిన అటవీ శాఖ ఈస్ట్ అధికారులు అనుమతి లేకుండా చెట్టు కొట్టివేతను నిర్థారించారు.  బాధ్యులైన వారికి రూ.62, 075 జరిమానా వేసి, వసూలు చేశారు.

బాధ్యతాయుతంగా వ్యవహరించి ఫిర్యాదు చేసిన బాలుడిని అటవీ శాఖ ఉన్నతాధికారులు అభినందించారు.

Related posts

కూతురిపై కన్నేశాడు కొడుకు చేతిలో చచ్చాడు

Satyam NEWS

ఉరి శిక్ష వేయడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి రోజా

Satyam NEWS

హైదరాబాదులోనే బెస్ట్ పార్కుగా సుందరయ్య పార్క్

Bhavani

Leave a Comment