38.2 C
Hyderabad
May 2, 2024 21: 45 PM
Slider వరంగల్

ప్రజావాణి దరఖాస్తులను సీరియస్ గా పరిష్కరించండి

#MuluguCollector

ప్రజావాణి దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కారం చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు కలెక్టర్  కాన్ఫరెన్స్ లో  ప్రజావాణి కార్యక్రమంలో  ప్రజల విజ్ఞాపనల పెండింగ్ పైన జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జరిగినది.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య పాల్గొని ప్రజా విజ్ఞాపన పత్రాల పెండింగ్ పైన రివ్యు చేయడం జరిగింది. జిల్లా అధికారులు విధిగా ప్రజావాణి కి హాజరు కావాలని వారు అన్నారు.

ఆన్లైన్ అటెండెన్స్ ఆప్ ద్వారా అటెండెన్స్ వేయాలని, గైర్హాజరు అయిన అధికారులకు షోకాజ్ నోటిసులు జారీచేయడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే “ఈ” ఫైలింగ్ ద్వారా ఫైల్స్  అప్లోడ్ చేయాలని  జిల్లా అధికారులను ఆదేశించారు.  

జిల్లా లో వివిధ శాఖల అధికారుల వద్ద ఫైల్ పెండింగ్ పైన రివ్యూ జరిగింది. జిల్లాలో ఇప్పటివరకు వివిధ శాఖల జిల్లా అధికారులకు ప్రజల నుండి 2117 విజ్ఞప్తులు రాగా, 1455 పరిష్కరించబడినట్లు మిగతావి పరిష్కార దశలో ఉన్నట్లు తెలిపారు.

జిల్లా లోని పల్లె ప్రగతి అభివృద్ది పనుల పైన జిల్లా ప్రత్యేక అధికారుల పనుల తీరును అడిగి తెలుసుకున్నారు.

ఈ సమీక్షా సమావేశంలో ఆర్డీఓ రమాదేవి, డి.ఆర్.డి.ఓ., పారిజాతం, జిల్లా కో – ఆపరేటివ్ అధికారి  విజయ్ భాస్కర్, ఇడి ఎస్సి కార్పొరేషన్ తుల రవి,  జిల్లా ఎస్సి కార్పొరేషన్ సంక్షేమ శాఖ అధికారిణి భాగ్యలక్ష్మి , ఐసిడిఎస్ అధికారిణి  ప్రేమలత, సంబంధిత శాఖ  అధికారులు  పాల్గొన్నారు.

కే.మహేందర్ గౌడ్, సత్యం న్యూస్

Related posts

ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసుల్లో కఠిన చర్యలు ఉండాలి

Satyam NEWS

తెలంగాణ ను దోపిడి చేసేందుకు మళ్లీ సిద్ధమౌతున్న దొంగలు

Satyam NEWS

మానవత్వం చాటిన జనచైతన్య ట్రస్ట్

Bhavani

Leave a Comment