33.7 C
Hyderabad
April 29, 2024 23: 13 PM
Slider హైదరాబాద్

మరో 48 గంటల పాటు భారీ వర్షాలు

#kaleruvenkatesh

గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా  ఉండాలని అంబర్పేట్ నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న 48 గంటల వరకు తీవ్రంగా కురువనున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న 48 గంటల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

అదేవిధంగా జులై నెల 24వ తేదీ వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ  సమయంలో అంతా అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలు, వివిధ కాలనీలు, బస్తీలలో నివసిస్తున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తక్షణ సహాయం అందించడానికి నాతో పాటు జిహెచ్ఎంసి, రెవెన్యూ, పోలీసు, విద్యుత్, డి ఆర్ ఎఫ్, విపత్తు నిర్వహణ ప్రత్యేక బృందాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా మీకు సహాయ సహకారాలు అందించడానికి అందుబాటులో ఉంటామని తెలియజేశారు.

ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లు: 9154032864, 9849906787, 7337557245, 8790374055, 9989930401.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

ఆక్సిజన్ కోసం విమానాలు వినియోగిస్తున్న తెలంగాణ

Satyam NEWS

సిసి కెమెరాల నిర్వహణ ఫండ్ కు 50 వేల రూపాయల విరాళం

Satyam NEWS

కరోనాతో శాశ్వతంగా వర్క్‌ ఫ్రం హోమ్‌

Sub Editor

Leave a Comment