29.7 C
Hyderabad
May 3, 2024 06: 16 AM
Slider ప్రత్యేకం

కోర్టుకు వెళ్లి పరువు పోగొట్టుకున్న పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి

#MinisterPeddireddyRamachandrareddy

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడే విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం విధించిన ఆంక్షలను రాష్ట్ర హైకోర్టు సమర్థించింది.

పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఇటీవల స్థానిక ఎన్నికలకు సంబంధించి 5వ తేదీన నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారు. అంతే కాకుండా ఏ అధికారి కూడా ఎన్నికల కమిషనర్ కు సహకరించరాదని, అలా సహకరించిన వారిపై ఎన్నికల తర్వాత చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యలు చేశారు.

మంత్రి చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని ఆయనను గృహనిర్భంధం చేయాలని స్థానిక ఎన్నికలు ముగిసే తేదీ ఫిబ్రవరి 21 వరకు మంత్రిని మీడియాతో మాట్లాడకుండా నిరోధించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగంలోని 243కె నిబంధన కింద ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ మంత్రి హైకోర్టును ఆశ్రయించగా ఆదివారంనాడు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు జస్టిస్ డి వి ఎస్ ఎస్ సోమయాజులు తుదితీర్పును వెల్లడించారు.

మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డిపై మీడియాతో మాట్లాడే అంశానికి సంబంధించి ఎన్నికల సంఘం విధించిన నిషేధాన్ని రాష్ట్ర హైకోర్టు  కొనసాగించింది. అయితే ఆయన గృహ నిర్బంధాన్ని నిర్దేశించిన ఆదేశాలను కొట్టివేసింది.

ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మీడియా సమావేశాలు నిర్వహించరాదని, ఎన్నికలు జరిగే ప్రాంతాలలో పర్యటించరాదని ఎన్నికల సంఘం విధించిన ఆంక్షలను హైకోర్టు సమర్థించింది.

ఈ ఆదేశాలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇకపై మీడియాతో మాట్లాడే అవకాశాన్ని ఎన్నికలు అయ్యేవరకూ కోల్పోయారు. దీనితో పెద్దిరెడ్డిపై ఆంక్షలు విధించిడంలో విజయం సాధించింది.

ఎన్నికల సంఘం పై న్యాయపోరాటంలో మంత్రి రామచంద్రారెడ్డి, ఆయనను సమర్థించిన రాష్ట్ర ప్రభుత్వానికి శృంగభంగం జరిగింది.

Related posts

ట్రాన్సజెండర్ ను వివాహం చేసుకున్న యువకుడు

Bhavani

మాడ్ నెస్ : ఇద్దరు కూతుళ్లను బావిలో తోసేసిన తండ్రి

Satyam NEWS

ప్రజా సమస్యల పరిష్కరమే నా ధ్యేయం

Satyam NEWS

Leave a Comment