29.7 C
Hyderabad
April 29, 2024 08: 48 AM
Slider ప్రత్యేకం

సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు హైకోర్టు ఆదేశాలు

#smithasabarwal

గతంలో తన ఫొటోను అవమానకరంగా ప్రచురించిందని సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌ అవుట్‌లుక్ మ్యాగజైన్‌పై పరువునష్టం దావా వేశారు. కోర్టు ఫీజుల కోసం ప్రభుత్వం ఆమెకు రూ.15 లక్షలు మంజూరు చేసింది. దీనిపై అవుట్‌లుక్ కోర్టులో పిటిషన్ వేసింది.

తాజాగా విచారణ చేపట్టిన ధర్మాసనం రూ.15 లక్షలు ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని స్మితా సబర్వాల్‌ను ఆదేశించింది. 90 రోజుల్లో చెల్లించకపోతే స్మితాసబర్వాల్ నుంచి వసూలు చేయాలని ఆదేశాలలో పేర్కొన్నారు.

ఫ్యాషన్ షో స్మితా సబర్వాల్ అధికార విధులు కావని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రైవేట్ వ్యక్తి ప్రైవేట్ సంస్థపై కేసు వేస్తే ప్రజా ప్రయోజనం కాదని హైకోర్టు తెలిపింది. స్మితాసబర్వాల్ కు ప్రభుత్వ నిధులు చెల్లించాలనే ప్రభుత్వ నిర్ణయం అసమంజసం, ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకం అని హైకోర్టు పేర్కొన్నది.

Related posts

నారాయణ మృతి యాదవ సంఘానికి తీరని లోటు

Satyam NEWS

మునుగోడులో గెలిచేది బీజేపీనే..

Satyam NEWS

శనిగకుంట అగ్ని ప్రమాద బాధితులకు గ్యాస్ స్టవ్ ల అందజేత

Satyam NEWS

Leave a Comment