26.7 C
Hyderabad
May 3, 2024 09: 30 AM
Slider ముఖ్యంశాలు

పెండింగ్ బిల్లులపై జగన్ ప్రభుత్వంపై మండిపడ్డ హైకోర్టు

#Y S Jagan

రాష్ట్ర ప్రభుత్వం మరో సారి రాష్ట్ర హైకోర్టు ఆగ్రహానికి గురైంది. ఈ సారి మరింత సీరియస్ గా హైకోర్టు హెచ్చరించడం గమనార్హం.

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఆగస్టు 1వ తేదీలోపు ఉపాధి హామీ పథకం (నరేగా) బకాయిలు చెల్లించకపోతే కోర్టుకు హాజరై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే ఆగస్టు 1న అధికారులు హైకోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టులో హాజరు కావాలని కోర్టు చెప్పింది.

కోర్టు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అమలు చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నరేగా పెండింగ్ బిల్లులు సుమారు 2500 కోట్ల వరకూ ఉన్నాయి. న్యాయస్థానాలతో ఎన్నిసార్లు చెప్పించుకుంటారని ఏపీ హైకోర్టు నిలదీసింది.

Related posts

జిజిహెచ్ లో విజయవంతంగా అరుదైన శస్త్ర చికిత్స

Satyam NEWS

అక్కడ బిల్లుకు మద్దతు తెలిపి ఇక్కడ వైసీపీ డ్రామాలు

Satyam NEWS

ఎం‌పి రవి కార్యాలయంపై ఈడి దాడులు

Murali Krishna

Leave a Comment