37.2 C
Hyderabad
April 30, 2024 14: 55 PM
Slider నల్గొండ

బోధవ్యాధి నిర్మూలన మాత్రల పంపిణీ కార్యక్రమం విజయవంతం

#hujurnagar phc

సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో బోధ వ్యాధి నిర్మూలన కార్యక్రమం బుధవారం  జరిగింది.

స్థానిక ఎంపిపి,మున్సిపల్  కార్యాలయంలో డిఈసి,ఆల్బెండజోల్ మాత్రలు అందజేశారు. అనంతరం ఎంపిపి గూడెపు శ్రీనివాస్, మున్సిపల్  వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు మాట్లాడుతూ బోధవ్యాధి నిర్మూలనకు గాను ప్రతి ఒక్కరూ డిఈసి మాత్రలు తీసుకోవాలని అన్నారు.మండల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ బోధవ్యాధి క్యూలెక్స్ దోమ కుట్టడం ద్వారా వ్యాపిస్తుందని,దీని నిర్ములనకు డై ఈతేయిల్ కార్బోమైజిన్ సిట్రేట్(డిఈసి),ఆల్బెండజోల్ మాత్రలు భారీ మొత్తంలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ మాత్రలను 2 సంవత్సరాల లోపు పిల్లలు,గర్భవతులు,ఇతర తీవ్ర రుగ్మతలతో బాధపడేవారు తీసుకోరాదని సూచించారు.డిఈసి,ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ 16,17 తేదీలలో కూడా ఆశా కార్యకర్తలు,స్వచ్ఛంద వాలంటీర్లను గృహ సందర్శన ద్వారా ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకుడు గెల్లి రవి,కౌన్సిలర్ గాయత్రి భాస్కర్ ,హెచ్ ఈ ఓ గజగంటి ప్రభాకర్, ఇందిరాల రామకృష్ణ,ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

హుజూర్ నగర్, సత్యం న్యూస్

Related posts

జ‌గ‌న‌న్న ఇళ్ల నిర్మాణంలో సాంకేతిక స‌మ‌స్య‌లు: ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వ్యాఖ్య‌

Satyam NEWS

రామారావు మారాజ్ గొప్ప ఆదర్శనీయుడు

Sub Editor

జైలుకు వెళ్లాల్సి వస్తుందనే కేసీఆర్ ఆరోపణలు

Satyam NEWS

Leave a Comment