33.7 C
Hyderabad
April 30, 2024 00: 22 AM
Slider ప్రత్యేకం

భార్యనే మోసం చేసిన ఐపీఎస్ ఆఫీసర్

trinee ips

ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేశ్వరరెడ్డిని కేంద్ర హోంశాఖ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ప్రేమ పెళ్లి చేసుకుని వేధించారని మహేశ్వర్‌రెడ్డిపై ఆయన భార్య భావన హైదరాబాద్‌ జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గృహహింస, ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదైంది.

ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉన్నందున తాత్కాలికంగా అతన్ని సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో కేంద్ర హోంశాఖ పేర్కొంది. కేసు నుంచి విముక్తి పొందిన తర్వాత తిరిగి ట్రైనీ ఐపీఎస్‌గా అవకాశం కల్పిస్తామని తెలిపింది. కడప జిల్లాకు చెందిన మహేశ్వర్‌ రెడ్డి సివిల్స్‌లో 126వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌గా ఎంపికయ్యారు.

ప్రస్తుతం ముస్సోరీలో ప్రాథమిక శిక్షణ పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో మిగతా శిక్షణా పూర్తి చేసుకోవాల్సి ఉంది. మహేశ్వరరెడ్డి ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఇంజినీరింగ్ చదివే సమయంలో కీసరకు చెందిన భావనతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది.

8 ఏళ్ల తర్వాత ఇద్దరూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గతేడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. ఐపీఎస్ కు ఎంపికైన తర్వాత ఎక్కువ కట్నం వస్తుందన్న కారణంతో మొహం చాటేస్తున్నాడని భావన అంటున్నది. విడాకులు ఇవ్వాలంటూ మహేశ్ బెదిరింపులకు దిగుతున్నాడంటూ కూడా ఆమె ఆరోపణలు చేసింది.

మహేశ్వర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని గతంలో పోలీసులకు, కేంద్రం హోం శాఖ కి ఆమె ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు చర్యలు తీసుకున్నారు. 

Related posts

ఘనంగా డా.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 121వ జయంతోత్సవం

Satyam NEWS

రన్ రాజా రన్: ముందుగా మూడింది ఉప శాఖలకు

Satyam NEWS

వల్గర్ ఫాదర్:కన్నతండ్రే కామాంధుడయ్యాడు

Satyam NEWS

Leave a Comment