32.7 C
Hyderabad
April 27, 2024 00: 49 AM
Slider ముఖ్యంశాలు

అలనాటి కవులకు, నేటి కవులకు వేదిక ఆటా

aataa meeting

అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ ఆధ్వర్యంలో ఈ రోజు అంతర్జాతీయ సాహితీ సదస్సు హైదరాబాద్‌ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం జరిగింది. ముందు తరాలతో సంభాషణ, నవ కవి సమ్మేళనం, పన్నెండుగురు కొత్తతరం కవుల కవిగానం, ఇప్పటి కథకులు ఆలోచన, అనుభవాలు, పద్యం పాటా, జానపదం కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఒకే వేదికపై అలనాటి కవులు, నేటి తరం కవులతో కలిసి 39 మంది కవులు అంతర్జాతీయ సాహితీ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రసిద్ద వచన కవులు కె.శివారెడ్డి, నందిని సిధారెడ్డి, రాచపాళెం, కె.శ్రీనివాస్‌, ఓల్గా, అఫ్సర్‌, కసిరెడ్డి వెంకట రెడ్డిలతో ఇప్పటి కథకుల ఆలోచనలు, అనుభవాలు కార్యక్రమంలో కె.ఎన్‌.మల్లీశ్వరి, వెల్దండి శ్రీధర్‌, పూడూరి రాజిరెడ్డి, వెంకట సిద్ధారెడ్డి, మల్లికార్జున్‌, పూర్ణిమ తమ్మిరెడ్డి, స్వాతి కుమారి బండ్లమూడి పాల్గొన్నారు.

పన్నెండు మంది కొత్త తరం కవులతో కవి సమ్మేళనం జరిగాయి. నేపధ్య గేయ రచయితలు దేశపతి శ్రీనివాస్‌, అనంత శ్రీరామ్‌, ప్రొద్దుటూరి యెల్లారెడ్డి పాల్గొనే ‘పద్యం, పాట, జానపదం’ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆటా ప్రెసిడెంట్ పరమేశ్ భీం రెడ్డి, తదుపరి ప్రెసిడెంట్ భువనేశ్ బుజాలా, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అనిల్ బోదిరెడ్డి, రామకృష్ణ రెడ్డి అలా, ఆటా 2020 కన్వెన్షన్ కన్వీనర్ నర్సింహా రెడ్డి ద్యాసాని పలువురు ఆటా ప్రతినిధులతో పాటు 20 మంది అమెరికా నుండి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇక్కడి తెలుగు ప్రజలకు అమెరికాలో ఉన్న తెలుగు ఆట ప్రజలకు వారధిగా ఉంటుందని అమెరికా తెలుగు సంఘం తదుపరి అధ్యక్షులు బువనేశ్ బుజాలా అన్నారు. ఆట ద్వారా ఆట అక్షరాల బాట అంటూ నవతరం కవులు యువతరం కవులకు మధ్య అనుసంధానం చేయడం ఆనందంగా ఉందని భువనేశ్ అన్నారు.

పాత కొత్త కవులతో అనుసంధాన సమావేశం సాహిత్య లోకానికి చేయుతనివ్వడానికి ఆట ఎప్పుడూ ముందు ఉంటుందని సాహిత్యలో రంగంలో మరింత మంది రాణించే విధంగా చేయుతనివ్వడానికి, భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని భువనేశ్ తెలిపారు. కేవలం సాహిత్యమే కాకుండా ఇతర రంగాల్లో కూడా అభివృద్ధికి ఆట అండగా ఉంటుందని ఆయన అన్నారు.

కవి శివారెడ్డి మాట్లాడుతూ కొత్త తరాల మీద మనకు కొన్ని అపోహలు అపనమ్మకాలు ఉన్నాయి. ఇతరులతో మనం నమ్మకం ఉంచినప్పుడు ఆదే నమ్మకంతో కొనసాగాలని అన్నారు. మా తరం ఒక నమ్మకంతో బయలుదేరిందని చెబుతూ నేర్చుకోవడం అనేది ఓ జీవిత కాలం ప్రయాణమని ఆయన అనుభవాలను పంచుకున్నారు. మీ వ్యక్తిత్వం మెరుగుపడాలంటే మీకు మీరే ఓ రోల్ మోడెల్ గా ఉండాలని.. ప్రతి రచయిత ప్రతి కవి కూడా మోడల్ ఓ ను సృష్టించాలని ఆయన సూచించారు.

ప్రతి తరం ఆ ముందు తరం నుంచి చాలా నేర్చుకోవాలి. కుటుంబ సామాజిక వ్యవస్థలో ఒక ఐడియల్ క్యారెక్టర్ ను సృష్టించగలగాలి. దూరంగా ఉంటే రచనలు ద్వారా దగ్గర ఉంటే వ్యకత్వం ద్వారా నేర్చుకుంటారు. ఇలాంటి అనుసంధాన కార్యక్రమాలు ఆటా చేయడం చాలా సంతోషంగా ఉందని శివారెడ్డి తెలిపారు. అందరిని ఒకే దగ్గరికి చేర్చి ఒకరి నుండి మరొకరికి స్ఫూర్తి నివ్వడానికి బాగా ఉపయోగపడతాయని వారు తెలిపారు.

నలుగురితో చర్చలు జరిగితే ఆలోచనలు వికసిస్తాయి.. ఈ ఆలోచనలు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని వ్యాసకర్త, జానపద వాజ్మయ పరిశోధకుడు కసిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎవరి ఆచరణలు అనుసరించే విధంగా ఉంటాయో వాళ్ళ మార్గాలను మనం అనుసరిస్తామని ఆయన తెలిపారు. ఎవరి అనుభవాల మాటమూటగా వస్తే అదే మనం విప్పుతామని అందులో సుగుణాలను మనం నేర్చుకుంటామని ఆయన తెలిపారు.

సాహిత్యానికి ఎంతో అపురూప శక్తి ఉందని… దేశ రక్షణకు, కుటుంబ వికాసానికి భాష పరిరక్షణకు, ఉగ్రవాద నిరోధానికి, కులాల మధ్య పోరు తగ్గించడానికి సాహిత్యం అవసరమని ఆయన తెలిపారు.

Related posts

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోడీ పాత్ర ఏమిటి?

Satyam NEWS

మన ఘన చరిత్ర రాబోయే తరాలకు అందించాలి

Satyam NEWS

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓయూ లో మాక్ అసెంబ్లీ

Satyam NEWS

Leave a Comment