29.7 C
Hyderabad
May 1, 2024 06: 16 AM
Slider నిజామాబాద్

నిధులు వచ్చేనా..? పనులు సాగేనా..?

#hospital

జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులకు ఆస్పత్రి సరిపోవడం లేదని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆస్పత్రుల ఆధునీకరణ పనులు చేపడుతోంది. అవసరం ఉన్న చోట అదనపు బెడ్లతో నూతన ఆస్పత్రులను నిర్మిస్తోంది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి 100 పడకల మాత శిశు ఆస్పత్రి మంజూరైంది. ఈ ఆస్పత్రి నిర్మాణానికి 17 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఆస్పత్రి నిర్మాణానికి నాటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి 01 జనవరి 2018 న శంకుస్థాపన చేశారు. ఏడాది లోపు ఆస్పత్రి నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామని చెప్పినా ఇప్పటికి పనులు సాగుతూనే ఉన్నాయి.

నిర్మాణంలో కేంద్రం వాటా విడుదల

ఆస్పత్రి నిర్మాణానికి 17 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసి పనులు ప్రారంభించారు. ఇందులో కేంద్రం వాటా 7 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 10 కోట్లు ఉంది. ఇందులో కేంద్రం వాటా విడుదల కావడంతో పనులు వేగంగా కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు పెండిగులోనే ఉన్నాయి.

హరీష్ రావు పర్యటనతో నిధులకు మోక్షం

గత ఫిబ్రవరి 13 న జిల్లా కేంద్రానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వచ్చారు. ఆశా వర్కర్లకు ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే మొదటిగా కామారెడ్డి జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. పనిలో పనిగా ఎంసిహెచ్ పనులను కూడా మంత్రి హరిశ్ రావు పరిశీలించారు. ఆస్పత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి నిధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నిధుల విడుదలపై మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేస్తామని, మూడు నాలుగు నెలల్లో ఆస్పత్రి పూర్తి చేస్తామన్నారు. మంత్రి  వచ్చి వెళ్ళాక ఇప్పటికి కేవలం నాలుగు కోట్లు మాత్రమే విడుదలైనట్టు సమాచారం. మిగతా 6 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది

నత్త నడకన సాగుతున్న పనులు

2018 సంవత్సరంలో మొదలైన మాత శిశు ఆస్పత్రి నిర్మాణ పనులు మొదలై దాదాపు ఐదేళ్లకావస్తోంది. ఇప్పటికి పనులు ఇంకా నత్త నడకనే సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన నిధులు సకాలంలో విడుదలై ఉంటే ఇప్పటికే ఆస్పత్రి నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చేది. నిధుల విడుదలలో జాప్యం కారణంతోనే ఆస్పత్రి పనులు మందకొడిగా సాగుతుంన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి ఆస్పత్రి నిర్మాణం తర్వాత మొదలైన బాన్సువాడ ఆస్పత్రి పనులు పూర్తయి ప్రారంభం కూడా అయిపోయింది. కామారెడ్డి ఆస్పత్రి మాత్రం ఇంకా పనులు సా… గుతూనే ఉన్నాయి.

ఎంసిహెచ్ కు అదనపు నిధులు

ఇప్పటికే 17 కోట్ల వ్యయంతో మాత శిశు ఆస్పత్రి నిర్మాణం కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు కింద ఫ్లోర్ కోసం మాత్రమే 17 కోట్లు అంచనా వేశారు. పనులు కూడా సాగాయి. ఇప్పుడు ఆస్పత్రి ఫస్ట్ ఫ్లోర్ పనులు కూడా సాగుతుండటంతో ఆస్పత్రికి మరిన్ని నిధులు మంజూరైనట్టుగా తెలుస్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా అదనపు నిర్మాణ పనులకు సుమారుగా 1క్ కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసినట్టుగా సమాచారం. రేపు మంత్రి పర్యటనలో నిధుల మంజూరు విషయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

రేపు మంత్రి హరీష్ రావు రాక

కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని రేపు కామారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు. రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు హాజరుకానున్నారు. ఎంసిహెచ్ పరిసర ప్రాంతంలో 23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఎంసిహెచ్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించనున్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ లో న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ ప్రారంభోత్సవంతో పాటు ఏఎన్ఎంలకు చీరల పంపిణీ చేపట్టనున్నట్టు అధికారులు ప్రకటించారు.

మంత్రి రాకతో నిధులు విడుదలయ్యేనా..?

గత ఫిబ్రవరి 13 జిల్లాకు వచ్చిన మంత్రి హరీష్ రావు మూడు నాలుగు నెలల్లో ఎంసిహెచ్ నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించడంతో పాటు పనులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 10 కోట్లు విడుదల చేస్తామన్నారు. మంత్రి వచ్చి వెళ్లి ఇప్పటికే 10 నెలలు గడిచినా నిధులు ఇంకా పెండిగులోనే ఉన్నాయి. రేపు మంత్రి పర్యటనతో నిధులు విడుదల అవుతాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

క్రిటికల్ కేర్ సెంటర్ స్థల పరిశీలన

కామారెడ్డి మండలం దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్  నిర్మాణానికి మంత్రి హరీష్ రావు భూమి పూజ చేయు స్థలాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. 23.75 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి  హరీష్ రావు  భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారని చెప్పారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంత్రి హరీష్ రావు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ,ఆరోగ్య అధికారి లక్ష్మణ్ సింగ్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.

Related posts

మరో అంబేద్కర్ మన కేసీఆర్ : ఎమ్మెల్యే బేతి

Satyam NEWS

మరి కొందరు స్కూలు పిల్లలకు కరోనా

Satyam NEWS

విశాఖ శారద పీఠంలో ముగిసిన యాగం

Satyam NEWS

Leave a Comment