38.2 C
Hyderabad
May 3, 2024 19: 50 PM
Slider వరంగల్

నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలి

#mlaseetakka

ములుగు నియోజక వర్గం వెనుకబడిన ప్రాంతమని, ఈ ప్రాంత అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమష్టిగా పని చేసి అభివృద్ధికి బాటలు వేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో ఆర్ అండ్ బి,పి.ఆర్, ఐబి ఐటిడిఏ అధికారులతో నేడు ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ములుగు ప్రాంతం లో ఇప్పటి వరకు మంజూరైన పనులు కొత్తగా వచ్చిన అభివృద్ధి పనుల పై ప్రతి నెలకోసారి  పనుల పురోగతి పై సమీక్ష చేసుకుందాం అని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల లో రోడ్లు లేక కనీస బస్ సౌకర్యం కూడా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పనుల పై నిఘా పెంచి సకలం లో పనులు పూర్తి చేసే విధంగా ఉండాలని కాంట్రాక్టర్లు నిర్లక్షం వహిస్తే ఊరుకునేది లేదని సీతక్క హెచ్చరించారు. ముఖ్యంగా బ్రిడ్జి ల నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు.  వర్షాకాలం లో గ్రామాల మధ్య రాక పొకలు లేక అవస్థలు పడుతున్నారు.

నిర్మాణ పనులను జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లకు నోటీస్ లు ఇవ్వండి టెండర్ ప్రక్రియ పూర్తి అయి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు చెయ్యకుండా ఉన్న పనులకు నూతన టెండర్ ప్రక్రియ చేసి పనులు ప్రారంభించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సీతక్క అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్ బి,పి.ఆర్, ఐబి, ఐటిడిఏ EE, DE, AE లు అధికారులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్‌

Satyam NEWS

ఫెస్టివల్:అభివృద్ధి ప్రదాత ఉద్యమ నేత కెసిఆర్

Satyam NEWS

2020లో 203 ఉగ్ర‌వాదులు హ‌తం… పాక్ బుద్ధి ఎప్ప‌టికీ మార‌దా?

Sub Editor

Leave a Comment