42.2 C
Hyderabad
May 3, 2024 15: 38 PM
Slider ప్రత్యేకం

రఘురామను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచవద్దు

#APHighCourt

ఏపి సీఐడి పోలీసులు అరెస్టు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి రఘురామ కృష్ణంరాజును తాము చెప్పే వరకూ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచవద్దని హైకోర్టు ఆదేశించింది. ఎంపీ అరెస్టుపై శనివారం మధ్యాహ్నం 1 గంటకు హైకోర్టు విచారణ జరపనుంది. ఈలోపు ఆయనను మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచరాదని సీఐడీని ఆదేశించింది. అరెస్టును సవాలు చేస్తూ రఘురామ కృష్ణంరాజు శుక్రవారం అప్పటికప్పుడు హైకోర్టులో హౌస్‌ మోషన్‌ దాఖలు చేశారు. ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణ, ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ సుధాకర్‌ రెడ్డి ఆడియో కాన్ఫరెన్స్‌లో వాదనలు వినిపించారు. వీటిని ఆలకించిన న్యాయమూర్తి జస్టిస్‌ సురేశ్‌ రెడ్డి ఈ తాత్కాలిక ఆదేశాలు జారీ చేశారు. శనివారం హౌస్‌మోషన్‌పై విచారణ జరిపేదాకా రఘురామను మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచరాదని సీఐడీని ఆదేశించారు. అలాగే… ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా… మందులు తెచ్చుకునేందుకు, బయటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు అనుమతించాలని స్పష్టం చేశారు.

Related posts

ఫండ్స్ ప్రాబ్లమ్: పేటలో నిఘా నేత్రాలు కనుమరుగు

Satyam NEWS

కోనసీమ రాజకీయాలతో జగన్ రెడ్డి కుయ్యో.. మొర్రో..

Satyam NEWS

శ్రమకు తగిన వేతనం ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం

Satyam NEWS

Leave a Comment