29.7 C
Hyderabad
May 1, 2024 03: 52 AM
Slider నల్గొండ

శ్రమకు తగిన వేతనం ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం

#CITUHujurnagar

‘పోరాడితే పోయేదేమిలేదు. బానిస సంకెళ్లు తప్ప.’ కార్మిక 29  చట్టాల సవరణ చేసి 4 కోడులుగా చేయటం, 3 వ్యవసాయ చట్టాలు తీసుకురావటం కార్మికవర్గానికి, రైతాంగానికి నష్టపరిచే చట్టాలకు వ్యతిరేకంగా మేడే స్ఫూర్తితో పోరాటానికి సమైక్యం కావాలని జిల్లా CITU ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని CITU కార్యాలయంలో మేడే కార్మిక దినోత్సవ పండగ సందర్భంగా జెండా ఎగురవేశారు.

అనంతరం పట్టణంలో ఉన్న సిఐటియు అనుబంధ సంఘాల రైస్ మిల్ కార్మికులు, మున్సిపల్, ఆటో, బిల్డింగ్, ఫ్లవర్స్ అసోసియేషన్, హమాలీలు, షాప్ గుమస్తాలు, జెండాలు ఆవిష్కరించిన పిదప రోషపతి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల శ్రమకు తగిన వేతనం ఇవ్వటంలో పూర్తిగా విఫలం చెందాయని,  కనీస వేతనం నెలకి 24,000 వేల రూపాయలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని, సంఘటిత రంగంలో నిర్మాణ సమగ్ర వేతన చట్టం  తేవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు అనుబంధ సంఘాల నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎలక సోమయ్య గౌడ్, గుండెబోయిన వెంకన్న, సాముల కోటమ్మ, మీసాల అంజి, చింతకాయల పర్వతాలు, కంకణాల రామయ్య, కోటా చారి, బేగం, మున్ని, రాజేష్ ,మహిపాల్, వీరమ్మ, బాలు, శీతల, చందు, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బీజేపీ నేత‌లు నోరు అదుపులో పెట్టుకోవాలి

Satyam NEWS

ఆర్ధిక పతనం: అధిక వడ్డీ చెల్లిస్తేకానీ పుట్టని అప్పు

Satyam NEWS

దుర్గామాత ఆశీస్సులు తీసుకున్న బిజెపి నాయకులు

Satyam NEWS

Leave a Comment