40.2 C
Hyderabad
April 29, 2024 17: 42 PM
Slider కడప

హై కోర్టు స్టే ధిక్కరించి రాజంపేటలో పట్టాల పంపిణీ…..

#RajampetTDP

రైతుల అధీనంలో ఉన్న భూములను హై కోర్టుస్టే ఇచ్చినా స్థానిక రెవెన్యూ అధికారి లెక్క చేయకుండా, స్టే తెచ్చిన రైతును పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఇండ్ల పట్టాలు ఇవ్వడం పై రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. వారికి స్థానిక టీడీపీ నేతలు సంఘీభావం ప్రకటించారు.

కడపజిల్లా రాజంపేట మండలం చుండువారి పల్లిలో ఇంటి పట్టాలు వివాదాస్పదంగా మారుతున్నాయి.ఈనెల 25 వతేది ఆర్భాటంగా వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి,ఎంపీ మిథున్ రెడ్డి ,సబ్ కలెక్టర్ కేతాన్ గార్గ్, జిల్లా వైసీపీ అధ్యక్షుడు అకేపాటి అమరనాధ రెడ్డి చేతుల మీదుగా ఇండ్ల పట్టాల పంపిణీ చేశారు రెవెన్యూ సిబ్బంది.

అయితే ఇండ్ల స్థలాలకు కేటాయించిన స్థలాలు వివాదస్పదంగా మారాయి. జగనన్న ఇళ్లపట్టాలు పేరుతో పంచిన ఇళ్ల స్థలాలపై ఇవి అనుభవం లో ఉన్నాయని రైతులు తమకు కేటాయించిన స్థలాలని హైకోర్టు ను ఆశ్రయించారు. డి.కె.టి పట్టాలు ఉండే దగ్గర ఇంటి స్థలాలు ఇవ్వకూడదని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కూడా బేఖాతర్ చేసి 25వ తారీకు నాడు దాదాపు 1700 మందికి పట్టాలు పంపిణీ చేసినట్లు రైతులు ఆరోపించారు.

దాదాపు 28 ఎకరాలు ఆరు మంది రైతులకు డి.పట్టాలు ఇచ్చారని, తమ అనుభవంలోనే ఉన్నాయని, బోర్లు వేసుకుని,కరెంటు సర్వీసులు కూడా ఉన్నాయని తెలిపారు. హై కోర్టులో ఆర్డర్ తెచ్చి అధికారులకు తెలిపినా, హైకోర్టు ఆర్డర్ ను దిక్కరించి పట్టాలు పంపిణీ జరిగిందని ఇది చాలా దురదృష్టకరం మని రైతులు వాపోయారు.

పట్టాల పంపిణీ సందర్భంగా స్టే తెచ్చిన రైతు సుధీర్ ను మన్నూరు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకొని ,కార్యక్రమం ముగిసిన అనంతరం వదిలారని ఆరోపించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల రాయుడు ఆదివారం సాయంత్రం వివాదాస్పద చుండువారిపల్లె ఇంటి పట్టాల ప్రాంతాన్ని టీడీపీ బృందంతో కలిసి పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే స్థలంలో గవర్నమెంట్ పర్పస్ క్రింద చాలా ఇన్స్ట్యూషన్స్ కి ఇచ్చిఉన్నారని, ఇక్కడ సైట్ ఫర్ సెంట్రల్ స్కూల్ 1202/2లో మొత్తం 15 ఎకరాలు ఇచ్చిఉన్నారని తెలిపారు. గురుకుల పాఠశాలకు కూడా ఇక్కడ స్థలం మంజూరు చేసి ఉన్నారని, అదేవిధంగా ఇంకా చాలా స్థలం దురాక్రమణలో ఉన్నదని కూడా తహశీల్దార్ ,సర్వేయర్ తెలిపినట్లు ఈ కాపీలో ఉందని,కానీ అధికారులు దురాక్రమణలో ఉన్న భూమిని తీసుకోకుండా రైతులకు ఇచ్చినటువంటి భూములు తీసుకోవడం చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు.

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ G+2 ఇండ్లు కట్టించాలని దాదాపు 1200 మందికి ప్లాన్ చేసి భూమిని కూడా అలాట్ చేయడం జరిగిందని టెండర్లకు కూడా పిలిచారు దురదృష్టం కొద్దీ అక్కడ వాళ్ళు కట్టలేనటువంటి పరిస్తితి ఈ అధికారంలోకి వస్తానే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందోనని దానిని నిలిపివేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

రాజంపేట టౌన్ నుండి ఐదు కిలమీటర్ల దూరం ఉందని తెలిపారు. ఇక్కడ పట్టాలు కలిగినటు వంటి భూములు వారికే ఉండాలని, దురాక్రమణ కు గురైనటువంటి భూములను రెవెన్యూ వారు స్వాధీనం చేసుకోవాలన్నారు.

ఇన్స్ట్యూషన్స్ సెంట్రల్,స్టేట్,ఎడ్యుకేషనల్ ఇన్స్ట్యూషన్స్ కి ఇచ్చిన భూముల జ్యోలుకి మీరు పోవద్దని (ఎడ్యుకేషన్ ఈజ్ షోర్ ఫర్ ఓవరాల్ డెవలప్ ఆఫ్ ద ఇండ్యుసెల్ యాజ్ ఫర్ యాజ్ ధ నేషన్)అని ఇన్ని ఏర్పాట్లు ఇక్కడ జరిగుంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇన్ని ఇన్స్ట్యూషన్స్ కి ఇక్కడ భూములు ఇచ్చివుంటే వాటిలో కూడా ఫ్లాట్లు వేశారని, ఇది తక్షణం విరమించుకోవాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తహశీల్దార్ ను హెచ్చరించారు.

తక్షణం ఇక్కడ ఇచ్చిన పట్టాలను రద్దుచేయాలని,పేదలకు భూములు కొని ఇవ్వాలని,అక్కడ 4500 కోట్లతో భూములు కొన్నారని, ఈ జిల్లాలో రాజంపేట నియోజకవర్గం లో ఎక్కడైనా ఒక్క సెంటు భూమి కొన్నారా అని ప్రశ్నించారు.

ఇక్కడ కూడా భూములు కొనేటిగా ఉంటే DKT స్థలానికి కూడా లాండ్ అక్విజేషన్ యాక్ట్ 2013 క్రింద నష్టపరిహరాన్ని చెల్లించాలని, ప్రజా ప్రయోజనాలకు అవసరమైనప్పుడు మీరు పైన తెలిపిన యాక్ట్ ప్రకారం తీసుకోమని కోర్టు కూడా చెప్తుందని ఆయన అన్నారు. ఇలాంటి తప్పులను తొక్కిపెట్టి బీదలకు మేము మేలు చేస్తున్నామని చెప్పి మరో బీదవాడికి అన్యాయం చేయడం చాలా తప్పు అని అన్నారు.

అలాగే ఆక్రమణలో ఉన్న భూములు తీసుకొని చుండువారిపల్లె పంచాయితీలో ఉన్నటువంటి అందరికి ముందు ఇళ్ల పట్టాలను అందజేసి తరువాత బయట వారికి మంజూరు చేయాలని రాజంపేట నియోజకవర్గ ప్రజల తరుపున, తెలుగుదేశం పార్టీ తరుపున బత్యాల డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చెన్నూరు సుధాకర్,పట్టణ అధ్యక్షుడు సంజీవరావు,మండల అధ్యక్షుడు సుబ్రమణ్యం నాయుడు,రాష్ట్ర అఖిల భారతీయ యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి భారతాల శ్రీధర్ బాబు యాదవ్,డి ఆర్.యల్ మని,గుగిళ్ల చంద్రమౌళి,నాగినేని నాగేశ్వర్ నాయుడు, తెలుగురైతు సుబ్బనరసయ్య, కొండా శ్రీనివాసులు,మందా శ్రీనివాసులు,రాంనగర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Related posts

గాజు గ్లాసు గుర్తు మాదే జనసేనకి సంబంధం లేదు

Bhavani

24 న రాజంపేటకు చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్

Satyam NEWS

ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇది రైతన్నల పొలికేక

Satyam NEWS

Leave a Comment