33.2 C
Hyderabad
May 14, 2024 12: 55 PM
Slider విజయనగరం

ఇల్లు కట్టించి ఇస్తామని దగా చేస్తున్న జగన్ ప్రభుత్వం

#jaganannahouses

జగనన్న ఇల్లు ప్రభుత్వం ఉచితంగా కట్టి ఇస్తామని చెప్పి లబ్ధి దారుల వద్ద హామీ పత్రాలు తీసుకున్న ప్రభుత్వం ఇప్ప‌టివ‌ర‌కునిర్మించిలేద‌ని  ఆంధ్ర ప్ర‌దేశ్ లోని విజ‌య‌న‌గ‌ర‌ప‌ట్ట‌ణ పౌర సంక్షేమ సంఘం విమ‌ర్శించింది..తీరా… ఇప్పుడు మీరేకట్టుకొండి ల‌క్షా 80వేలు ఇస్తామ‌ని చేతులు దులుపు కుంటోంద‌ని విమ‌ర్శించింది.

ఇల్లు కట్టక పోతే పట్టా తిరిగి ఇచ్చేయాలని లేదంటే రేష‌న్ కార్డ్ కట్ చేస్తామని బెదిరిస్తున్నార‌ని ఆ సంఘం కార్య‌ద‌ర్శిశంక‌ర‌రావు ఆరోపించారు.ఇండ్ల‌నిర్మాణాల‌స‌మ‌స్య‌ల‌కై న‌గ‌రంలోని మున్సిప‌ల్ కార్పొరేష‌న్ వ‌ద్ద‌..ల‌బ్దిదారుల‌తో ధ‌ర్నా నిర్వహించింది…ప‌ట్ట‌ణ పౌర‌సంక్షేమ సంఘం.

ఈ సంద‌ర్బంగా సంఘం కార్య‌దర్శి రెడ్డి శంక‌ర‌రావు  మాట్లాడుతూ….. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వమే జగనన్న ఇల్లు కట్టి ఇవ్వాలనిడిమాండ్ చేశారు.   అలాగే టిడ్ కో ఇల్లు లబ్ధి దారులు వద్ధ లక్షరూపాయలు కట్టించుకుని నాలుగేళ్లు అయింది నేటికీ ఇల్లుఅప్పజెప్పలేదని… మరోవైపు అప్పు కి వడ్డీ కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నార‌ని విమ‌ర్శించారు.

గత ప్రభుత్వం కట్టిన సారిపల్లి వద్ధ 2200, సోనియా నగర్ లో 1200 ఇల్లు పూర్తయినా లబ్ధి దారులకు అప్పజెప్ప కుండా  తాజాగా మరో 3 లక్షలు కట్ట మంటూన్నార‌ని…. ఇది అన్యాయమన్నారు. హోదూద్ ఇళ్లకు కరెంట్ వేయాలని.. రామకృష్ణా నగర్…ఎల్బీజీ నగర్ లో నివాసం ఉన్నచోటే పేదలకి పట్టాలివ్వాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు .. అధ్యక్షుడు రామచంద్ర రావు లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు పి. రమణమ్మ. సీఐటీయూ నగర అధ్యక్షుడు బి. రమణ కార్యదర్శి జగన్ మోహన్. సీఐటీయూ నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

భక్తులకు తెరచుకున్న భద్రాచలం ఆలయ ద్వారాలు

Satyam NEWS

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్ర‌తీక కెవీ రంగారెడ్డి

Sub Editor

గణతంత్ర సంబరం

Satyam NEWS

Leave a Comment