33.7 C
Hyderabad
April 30, 2024 02: 43 AM
Slider ప్రత్యేకం

మర్డర్ కేసుల్లో నిందితులే మన బ్రాండ్ అంబాసిడర్లు?

#ysavinashreddy

సొంత బాబాయిని చంపించిన వాడొకడు, దళిత డ్రైవర్ ను చంపిన వాడు ఇంకొకడు… ఈ ఇద్దరే వైసీపీకి బ్రాండ్ అంబాసిడర్లు అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. సొంత బాబాయి మర్డర్ కేసులో ఏ 8 గా ఉన్న అవినాష్ రెడ్డి, దళితుడిని చంపిన అనంతబాబు ఇప్పుడు సీఎం జగన్ రెడ్డికి ఎంతో సన్నిహితులు. అవినాష్ రెడ్డికి మళ్లీ కడప ఎంపి సీటు ఇచ్చి ఆయనను గెలిపించాల్సిందిగా సీఎం జగన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు.

దళిత డ్రైవర్ ను హత్య చేసినట్లు స్వయంగా ఒప్పుకున్న ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పుడు కోస్తా ప్రాంతం అంతా కలియతిరుగుతూ వైసీపీని గెలిపించాల్సిందిగా కోరుతున్నారు. అనంతబాబును ఆ ప్రాంతంలోని దళితులు తరిమి కొడుతుండగా, అవినాష్ రెడ్డిని స్థానికులు ప్రశ్నలో ముంచెత్తుతున్నారు. కోస్తా రాయలసీమ ప్రాంతాలలో ఈ ఇద్దరి గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్నది.

హత్య కేసులతో సంబంధం ఉన్న ఈ ఇద్దరిని పక్కన కూర్చొబెట్టుకుని జగన్ రెడ్డి ఏం సందేశం ఇస్తున్నారు అనే చర్చ జరుగుతున్నది.

సొంత బాబాయ్ ని హత్య చేసినట్లుగా కేసులు ఎదుర్కొని కోర్టుల చుట్టు తిరుగుతూ… సొంత బంధువులతో ఛీ కొట్టించుకుంటున్న వ్యక్తి అవినాష్ రెడ్డి. రోజూ వీరి వ్యవహారాలే హైలెట్ అవుతున్నాయి వైసీపీ లో ఇలాంటి వాళ్లకు మాత్రమే భవిష్యత్ ఉంటుందని .. వాళ్లను గెలిపిస్తే.. ప్రజలకు భవిష్యత్ ఉంటుందా అని గుసగుసలాడుకుంటున్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి గురించి చర్చ జరగని రోజు లేదు.

సునీత, షర్మిల ఇద్దరూ ప్రతీ రోజూ.. అవినాష్ రెడ్డి గురించి చెబుతున్నారు. ఆయన ప్రతీ వారం కోర్టుకు హాజరు కావాల్సి వస్తోంది. మరో వైపు సాక్షుల్ని బెదిరించిన వ్యవహారంలో బెయిల్ రద్దు పిటిషన్ హైకోర్టులో ఉంది. రద్దు చేయాల్సిందేనని.. సాక్షుల్ని బెదిరించినట్లుగా సాక్ష్యాలు ఉన్నాయని సీబీఐ సైతం స్పష్టం చేసింది. ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్త చర్చ జరుగుతోంంది.

ఇక మరో వైపు అనంతబాబు వ్యవహారం కూడా అదే స్థాయిలో రచ్చ అవుతోంది. ఆయన ఏ ఊరికి వెళ్లినా దళితులు వెంట పడుతున్నారు. కొత్తగా ఆయన రంపచోడవరం కాకుండా.. ప్రత్తిపాడులో కూడా వేలు పెడుతున్నారు. అక్కడ తన సమీప బంధువు అయిన వరుపుల సుబ్బారావుకు టిక్కెట్ ఇప్పించుకుని ఆయన వయసు కారణంగా మొత్తం తానే చక్క బెడుతున్నారు. గ్రామాల్లోకి వెళ్తే అక్కడి జనం తరిమికొడుతున్నారు. ఈ వీడియోలు వైరల అవుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో పోలీసులతో ఆయన భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాడులు చేస్తున్నారు. అయినా తిరగబడేవారు ఎక్కువ కావడంతో పరారు కావాల్సి వస్తోంది. నిజానికి అనంతబాబు ను వైసీపీ సస్పెండ్ చేసింది. కానీ ఉత్తుత్తినే. ఇలా కూడా మోసం చేయవచ్చని వైసీపీ అధినేత ప్రజలకు చూపిస్తున్నారు.

Related posts

అక్టోబర్ కు 1.50 లక్షల టిడ్కో గృహ ప్రవేశాలు

Satyam NEWS

గౌడ్ లు రాజ్యాధికారం దిశగా కృషి చేయాలి

Satyam NEWS

ఉద్యోగుల జీతాల భారం దించుకోవడానికి ఉత్తమ మార్గం

Satyam NEWS

Leave a Comment