29.7 C
Hyderabad
May 2, 2024 06: 37 AM
Slider ముఖ్యంశాలు

రవాణా శాఖ కు భారీగా ఆదాయo

#ajay

గతంలో ఎన్నడూ లేని విధంగా రవాణా శాఖ కు భారీగా ఆదాయం సమకూరుతోంది. ఇటీవల కాలంలో ప్రభుత్వ నిభంధనలను కఠినంగా అమలు చేయడం తో గత ఏడాది కంటే ఇప్పటివరకు 2309 కోట్ల ఆదాయం అధికంగా ఆదాయం వచ్చింది.  ఆర్ధిక సంవత్సరం చివరినాటికి మొత్తం రూ . 6285 కోట్ల  ఆదాయo వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోని  ఖైరతబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో రవాణా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  శనివారం  సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖలో కొనసాగుతున్న సేవలు, ఆదాయ వనరులు, చేపట్టాల్సిన పలు చర్యలపై అధికారులతో సమీక్షించారు.  డ్రైవరు లైసెన్స్, వాహానాల రిజిస్ట్రేషన్, పర్మిట్ల జారీ, పన్ను వసూళ్లు నిభంధన వుల్లంఘనల అమలు  తదితర అంశాల పై అధిక ఆదాయo వస్తున్నదని,  2021-22 లో రవాణా శాఖ ఆదాయం రూ. 3971 కోట్లు కాగా ఈ ఏడాది ఇప్పటివరకు రూ. 6055 కోట్లు రాగా, ఈ నెల చివరికి అది 6285 కోట్లు వచ్చే  అవకాశం వున్నదని పువ్వాడ చెప్పారు.  ఇటీవల స్పెషల్ డ్రైవ్ ద్వారా 21,347 వాహనాలను  తనిఖీ చేసి  టాక్స్, పెనాల్టీ ద్వారా రూ.63.58 కోట్లు వసూలు చేయడo జరిగిందని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా పువ్వాడ రవాణా శాఖ అధికారులను అభినందించారు. ఈ సమీక్షలో రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి  శ్రీనివాస రాజు, రవాణా శాఖ కార్యదర్శి  బుద్దప్రకాష్ జ్యోతి, రవాణా శాఖ వున్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

కరోనా బాధితులకు హోం క్వారంటైన్ కు తరలింపు

Satyam NEWS

పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనానికి మేం రెడీ

Satyam NEWS

పోలీస్ డైరీ: కమ్మచెట్టి అశోక్ లా మనం ఉండగలమా?

Satyam NEWS

Leave a Comment