40.2 C
Hyderabad
May 1, 2024 17: 54 PM
Slider జాతీయం

నమ్మితే నట్టేటా ముంచారు.. రూ.55 లక్షల పైగా దోపిడీ

బెంగళూరుకు చెందిన శ్రీధర్(47) వృత్తిరీత్యా అకౌంటెంట్. అయితే, వీరి ఇంటికి కాపలాగా సెక్యూరిటీ గార్డును కృష్ణ ను నియమించుకున్నారు. ఇంట్లో పనిమినిషిగా అతని భార్య జానకికి పెట్టుకున్నారు. వీరిద్దరూ ఉండేందుకు ఇంట్లోనే ఓ గదిని కూడా ఇచ్చారు. అయితే, తాజాగా శ్రీధర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ శుభకార్యానికి వెళ్లారు.

ఇదే అదునుగా భావించిన.. సెక్యూరిటీ గార్డు, అతని భార్య భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న రూ. 47 లక్షల నగదు, సుమారు రూ.8 లక్షల విలువైన 170 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. మధ్యాహ్నం శ్రీధర్, కుటుంబ సభ్యలు వచ్చి చూడగా.. ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. సెక్యూరిటీ గార్డు, అతని భార్య ఇద్దరూ కనిపించడం లేదు. ఇంట్లోకెళ్లి బీరువా చూడగా.. డబ్బు, నగలు కనిపించడం లేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు శ్రీధర్.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దోపిడీ జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న కృష్ణ, జానకిని పట్టుకోవడం కోసం ప్రత్యేకంగా మూడు బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసులు ఆ ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 381 కింద కేసు నమోదు చేశారు. అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నెల రోజుల క్రితం సెక్యూరిటీ గార్డు కృష్ణ ఓ దొంగతనం కేసులో దొరికిపోయాడు.

అయితే, అతను అలాంటి వాడు కాదని, మంచివాడని శ్రీధర్ వకల్తా ఇచ్చి స్టేషన్ నుంచి విడిపించాడు. అప్పటికే అనుమానించిన పోలీసులు.. సెక్యూరిటీ గార్డును మార్చుకోండి అంటూ శ్రీధర్‌కు వార్నింగ్ ఇచ్చారు. కానీ, నమ్మి జైలు నుంచి విడిపించిన ఫలితం.. ఇల్లును గుల్ల చేసి సొత్తునంతా ఎత్తుకెళ్లారు.

Related posts

హైదరాబాద్ పరిసరాల్లో 50 వేల మందికి కరోనా టెస్టు

Satyam NEWS

తెలుగులో మళ్లీ ఎంట్రీ ఇస్తున్న ఇలియానా?

Satyam NEWS

సోనాలికా నుంచి టైగర్‌ డీఐ 75 4డబ్ల్యుడీ ట్రాక్టర్‌ విడుదల

Satyam NEWS

Leave a Comment