32.7 C
Hyderabad
April 27, 2024 01: 14 AM
Slider వరంగల్

ఇన్ స్పిరేషన్ :యూట్యాబ్ ఛానెల్ చూసి నేరాలకు…

janagam police 14

వాట్సాప్ ద్వారా ధనవంతులను, వారి కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను శనివారం జనగామ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి నేరానికి ఉపయోగించి రెండు సెల్ ఫోన్లు ఒక సీమ్ కార్డు ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

డి సి పి వెస్ట్ జోన్ చెప్పిన వివరాల ప్రకారం జనగామకు చెందిన మోరే భాస్కర్ (37) పసరమడ్ల కు చెందిన నిమ్మల ప్రభాకర్ (25) ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అరె భాస్కర్ 2015 లో కూడ ఇలాంటి కేసులోనే జైలుకు వెళ్లాడు. మళ్లీ తిరిగి తన హోటల్లో పనిచేసే నిమ్మల ప్రభాకర్ తో కలిసి యూట్యూబ్లో మురళీధర్ నిర్వహించే ఐడ్రీమ్ ఛానెల్లో పాత నేరస్తుల ఇంటర్వ్యూలను చూసి ప్రభావితమైయ్యారు.

“చండ్ర పుల్లారెడ్డి దళం” పేరుతో జనగామ కి చెందిన తుమ్మ రాజిరెడ్డి కి, అతని అన్నబాలశారి రెడ్డి ని బెదిరించారు. 25 లక్షలు డిమాండ్ చేస్తూ ఇవ్వకపోతే కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించారు. అదేవిధంగా వెల్మజాల కు చెందిన తన బంధువు ఆర్ఎంపీ డాక్టర్ గాజులపాటి నర్సింగరావును 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

“అంబర్ పేట భాయ్’ పేరుతో అతని కొడుకుని ఆక్సిడెంట్ చేసి చంపుతానని బెదిరింపులకు పాల్పడినాడు. దీనిపై గుండాల PS లో కేసు నమోదు అయింది. అదేవిధంగా నిందితులను అరెస్టు చేశారు. జనగామ ఇన్స్పెక్టర్ డి.మల్లేష్ ఆధ్వర్యంలో ఎస్ ఐ రాజేష్, PSI కిషోర్, హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి, కానిస్టేబుల్ కృష్ణ, రామన్న కేసు దర్యాప్తు చేశారు.

Related posts

మారుమూల గిరిజన గ్రామాలకు తక్షణం త్రీ ఫేజ్ విద్యుత్ సౌకర్యం

Satyam NEWS

మంత్రి కారు ఢీకొని ఒకరి మృతి: బాధితుల ధర్నా

Satyam NEWS

ముఖ్యమంత్రి ప్రసంగం జోష్ తగ్గిందా?

Satyam NEWS

Leave a Comment