37.2 C
Hyderabad
April 26, 2024 22: 02 PM
Slider మహబూబ్ నగర్

సాంప్రదాయ రంగులతో ఆనందోత్సాహాల మధ్య హోలీ

#udai

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌ పి. ఉదయ్ కుమార్ క్యాంపు ఆఫీస్ లో హోలీ వేడుకలు చూడముచ్చటగా సాగాయి. జిల్లా ఎస్పీ కే మనోహర్, అడిషన ల్‌ కలెక్టర్‌ మోతిలాల్ సభావట్, వివిధ శాఖల సిబ్బంది, చిన్నారులు  తరలివచ్చి సంప్రదాయ రంగులు చల్లుకొని వేడుకలు నిర్వహించారు. ఆప్యాయతతో ఒకరినొకరు పలకరించుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. క్యాంప్ ఆఫీస్ ప్రాంగణం అంతా రంగుల మయం అయింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో హోలీ కి అత్యధిక ప్రాధాన్యత ఉందన్నారు. రంగులతో ఈ ఉత్సవాన్ని ఇలా జరుపుకోవడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం ఉందన్నారు. జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ సప్తరంగులవలె ప్రతి ఒక్కరి జీవితం ఆనందంగా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో  సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. మత కుల విద్వేషాలు లేకుండా ప్రేమ అనురాగవులతో ఉంటూ సంతోషంగా గడపాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ వేడుకల్లో చిన్నారులు వివిధ వర్గాల ప్రజలు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

మరో భారీ బడ్జెట్ తో ప్రభాస్ సినిమా

Satyam NEWS

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటియేషన్ కార్డులు

Satyam NEWS

నేను మంత్రిని కరోనా అంటే నాకేం భయం?

Satyam NEWS

Leave a Comment