29.7 C
Hyderabad
May 2, 2024 06: 23 AM
Slider జాతీయం

అర్ధరాత్రి అంత్యక్రియలు మానవహక్కుల ఉల్లంఘనే

#Hatras

హత్రాస్ అత్యాచార సంఘటనలో అర్ధ రాత్రి అంత్యక్రియలు నిర్వహించడం కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని అలహాబాద్ హైకోర్టు అభిప్రాయపడింది.

దీనికి బాధ్యులు ఎవరో కచ్చితంగా నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హత్రాస్ లాంటి సంఘటనలు జరిగినప్పుడు అంత్యక్రియలు నిర్వహించే విధివిధానాలను రూపొందించాలని కూడా అలహాబాద్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

హత్రాస్ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నందున బహిరంగంగా ప్రకటనలు చేయడం మానుకోవాలని అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది.

అదే విధంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కూడా హత్రాస్ సంఘటనకు సంబంధించిన అంశాలను రిపోర్టు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది.

బాధితురాలి కుటుంబాన్ని, ప్రభుత్వ అధికారులను కూడా విచారించిన తర్వాత అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ రాయ్, పంకజ్ మిట్టల్ లతో కూడిన బెంచ్ నేడు ఈ ఆదేశాలను జారీ చేసింది.

Related posts

జీహెచ్ఎంసీ సమరమే!

Sub Editor

ఈటల రాజేందర్ అరెస్టుకు రంగం సిద్ధం?

Satyam NEWS

అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

Satyam NEWS

Leave a Comment